Facebook Twitter
డైరీ

 

డైరీ

 

- రమా

 

అక్షర నక్షత్రాలను కూర్చుకున్న
జ్ఞాపకాల కూడలి
మనసు మర్మాలని మౌనంగా
భరించే ఓ మౌనిక
గతకాలపు సృతులన్నిటిని
పదిల పరిచే
చెదిరిపోయిన అనుబంధాల
కన్నీటి కావ్యాల, చిరునవ్వు గీతాల
మౌనసాక్షి
ఒకొక్క పేజీ ఓ కళాఖండం
మనసు అంచుల్ని అందించే
దృశ్య కావ్యం
ఎప్పుడైనా,ఎక్కడైనా
పేజీ తిరగేస్తే
హృదయ కవటాలని
అతి సున్నితంగా తాకే
ఓ చిరు తెమ్మెర
నీలోని భావాన్నిటి
భావ కావ్యం
నీకున్న ప్రేమ బంధం
వీడని, వీడలేని మిత్రం
అయినా దాని హృది విశాలం
నీకలం పోటుకై
నిరీక్షించే నీ డైరీ
రాయని ఓ అద్భుత కావ్యం