Facebook Twitter
వృక్షమే

                                                                                                                    డా.వై. రామకృష్ణారావు

వృక్షమే
చిరకాలం జీవించే
చరిత్ర పుస్తకం
చెట్టు నుండే గా కాయితం.

ఎంత జిగురు పూసినా
నీడ
నేలకి అంటుకోదు
మళ్ళీ నా వెంటే.

మండే సూర్యుణ్ణి
కాస్త
చెట్టు నీడకు
పిలవాలనిపిస్తుంది.