Facebook Twitter
అర్హత

అర్హత

                                                                                                              - శ్రీమతి శారద అశోకవర్ధన్

పనికి రానివాడు పదవికెక్కితే
    పరువు మర్యాదలు వీధి కెక్కుతాయి

    నల్లగా వున్నానని కాకి కోకిలతో పోల్చుకుని
    ' కాకి' అని అరిస్తే అది పాటవుతుందా?
    కాకి కోకిలవుతుందా?

    రూపమొక్కటే అయినా
    గుణములు ఒక్కటెలా అవుతాయి?
    అర్హత శాశ్వతం
    అనుకరణ తాత్కాలికం!

    అందుకే క్షణికమైన తాత్కాలికమైన వాటికి పాకులాడకు
    శాశ్వతమైన అమరత్వాన్ని ఆపాదించయత్నించు!