Facebook Twitter
నువ్వు వస్తావని

నువ్వు వస్తావని

 

 

 నువ్వు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది
   

అది విన్న నా మనసు ఆనందంతో  నాట్యమాడింది
   

ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది
   

నువ్వు లేక నా కంటి కాటుక కరిగింది
   

ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడుంది
   

నేను వద్దన్నా నా మనసు నా మాట
   

వినకుండా నీతో  వచ్చేసింది

నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది
   

ఇంతవరకు పెదవులపై చిరునవ్వు దూరమైంది
   

నువ్వు వచ్చాకే  అది తిరిగి వచ్చింది
   

వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది
   
    ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్నుఅడిగింది.
   

ఆ ప్రశ్నకి నా సిగలోని  గులాబి  నవ్వింది
   

ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది
   

నీలా నేను దాగలేనంటూ నా ముఖం చిన్నబోయింది
   

నువ్వే నా ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చింది