Facebook Twitter
నాగరీకులు - ఆధునీకులు - బి.ఎల్.ఎన్. సత్యప్రియ

నాగరీకులు - ఆధునీకులు

 

- బి.ఎల్.ఎన్. సత్యప్రియ

 

 

కట్టినతాళే-

కాలసర్పమై

కాటేస్తుంటే

అత్తమామలే

మృత్యుదూతలై

మరణశాశనం

లిఖిస్తుంటే

ఓర్చుకోలేక

కుయుక్తులు నేర్చుకోలేక

తనకు తానుగా

తనువు చాలిస్తే-

తప్పు చేసుంటుంది!

అంటారీ నాగరీకులూ!-

 

గుండె దిటవు చేసుకుని

బంధనాలని తెంచుకుని

భవిత కోసం ఆశపడితే

బరి తెగించిందనే బిరుదిచ్చి

అక్కను కొద్దీ అణిచేస్తారు.

ఈ ఆధునీకులు-!