Facebook Twitter
మేఘసందేశం - సి.రామ్మోహన్

"మేఘసందేశం"

 

- సిరామ్మోహన్

 

అనూష పవనాలు అలవోకగా కదులుతు

వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటు వెళ్ళిపోగానే,

శశికాంతుడు చిర్నగవుతో నిశికాంతను

కలుసుకొన్న వేళ..........

 

ఆగి ఆగి కదులుతున్న మేఘమాలను దీనంగా

వేడుకుని

పంపిస్తున్నా ప్రియా నీ కోసం ఈ "మేఘసందేశం",

 

నే పంపిన సందేశం మేఘాల నుండి వానచినుకుగామారి

దివి నుండి జాలువారి నీ నడిపాపిట సింధూరంగా

మారి నొసటిని సృషిస్తు, కనురెప్పలని పలుకరిస్తూ

నీ అధరామృతాలని గ్రోలి, గళంపైన

స-రి-గ-మ-లతో సంగీతం పలికిస్తు

నీ గుండె గుడిలో ఇంకిపోయి వినిపించలేదా

సఖీ! నా "మేఘసందేశం,"?

 

వినిపిస్తే ఆలస్యం చేయక ప్రత్యూష పవనంలా వచ్చి

నా ఎదహృదిలో దీపాన్ని వెలిగించు,

నా గుండెపై స్వాతి జల్లు కురిపించు చెలీ!