Facebook Twitter
వసంతం, గమ్మత్తుగా పూయిస్తుంది

వసంతం, గమ్మత్తుగా పూయిస్తుంది

కండ్లకుంట శరత్ చంద్ర

 

వసంతం, గమ్మత్తుగా పూయిస్తుంది

గ్రీష్మం, మత్తు వదిలించేలా మండిస్తుంది

వర్షం,నీటి ముత్యాలు కురిపిస్తుంది.

శరత్తు,చందగానం పలికిస్తుంది

హేమంతం,ప్రకృతిని వాటేసి వణికిస్తుంది

శిశిరం, తియ్యగా కాటేస్తుంది!