Facebook Twitter
ఏదయినా పర్వాలేదు! నీ ఇష్టం!

ఏదయినా పర్వాలేదు! నీ ఇష్టం!

కండ్లకుంట శరత్ చంద్ర

(ప్రేయసీ ప్రియుల మద్య జరిగే సంభాషణ)

ప్రియుడు:- లంచ్ ఏం తిందాం?

ప్రేయసి:- ఏదయినా పర్వాలేదు..

ప్రియుడు:-సరే,ఐతే నూడిల్స్ తిందాం.

ప్రేయసి:-అమ్మో,వద్దు.పొయిన సారి

తింటే మొటిమలు వచ్చాయి.

ప్రియుడు:-సరే,ఫ్రైడ్ రైస్ తిందాం.

ప్రేయసి:-అబ్బా..వద్దు.పొయినసారి

అదే తిన్నాం కదా.

ప్రియుడు:-ఓక్! ఐతే చికెన్ బిర్యానీ

తిందాం.

ప్రేయసి:-రేపు ఒక పెళ్ళికి వెళ్ళాలి.

అక్కడ తింటాను అది.ఇప్పుడు వద్దు.

ప్రియుడు:-సరే మరి, ఇంతకూ ఎం తిందాం?

ప్రేయసి:- ఏదయినా పర్వాలేదు..

(మొత్తానికి ఏదో తిని బయటికి వచ్చారు).

ప్రియుడు:-ఇప్పుడు ఏం చేద్దాం?

ప్రేయసి:-నీ ఇష్టం

ప్రియుడు:-సినిమాకు వెళ్దామా?

చూసి చాలా రోజులయ్యింది.

ప్రేయసి:-అబ్బా..బోర్,టైం వేస్ట్.

ప్రియుడు:-పోనీ,టాంక్ బండ్ కి వెళ్దామ.

ప్రేయసి:-ఇంత ఎండలోనా? వద్దు.

ప్రియుడు:-పొనీ,ఎన్.టీ.ఆర్ గార్డెన్ కి వెళ్దామా?

ప్రేయసి:-అబ్బా, ఎన్నిసార్లు వెళ్తాం అక్కడికి?

ప్రియుడు:-సరే, నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం?

ప్రేయసి:-నీ ఇష్టం.

(సరే, ఏవో తిరుగుళ్ళు తిరిగారు.)

ప్రియుడు:-సరే మరి, ఇళ్ళకు వెళ్ళిపొదాం,

రేపు కలుద్దాం.సరేనా?

ప్రేయసి:-నీ ఇష్టం.

ప్రియుడు:-పద బస్ ఎక్కుదాం.

నేనూ సగం దూరం వస్తాను.

ప్రేయసి:- అబ్బ,బస్సా!రష్ ఉంటుంది.

ప్రియుడు:-సరే,ఆటోలో వెళ్దాం.

ప్రేయసి:-ఆటో వాళ్ళు మీటర్ సరిగ్గా వెయ్యరు.

ప్రియుడు:-ఐతే, క్యాబ్ లో వెళ్దాం.

ప్రేయసి:-క్యాబ్ లో వెళ్ళేంత దూరం లేదుగా.

డబ్బు దండగ!

ప్రియుడు:-సరే, వాతవరణం బానే ఉంది కదా.

నడిచి వెళ్దాం, పద.

ప్రేయసి:-అమ్మో,నేను నడవలేను,

నాకు ఆకలిగా ఉంది.

ప్రియుడు:-సరే, నువ్వే చెప్పు ఏం చెయ్యలో?

ప్రేయసి:-నీ ఇష్టం.

ప్రియుడు:-డిన్నర్ చేసేసి వెళ్దామా?

ప్రేయసి:-నీ ఇష్టం.

ప్రియుడు:-ఏం తిందాం?

ప్రేయసి:-ఏదయినా పర్వాలేదు.