Facebook Twitter
ఏ నాధుడు తీర్చలేడు

ఏ నాధుడు తీర్చలేడు

- రమ

అందమైన హిమాలయాలు

అందాలన్నీ చీరగా చుట్టుకుని

కనువిందుగా మురిపించాయ్,

రా రమ్మని ఆహ్వానించాయ్...

ఆ పరమాత్ముడు ముక్తినిస్తాడంటూ... నమ్మబలికాయ్

ఆశతో ఒడి చేరి ఆనందంలో మునిగి

తేలుతున్నవారందరిని దయదాక్షిణ్యాలు లేకుండా ముంచేసాయ్...

శవాలుగా మార్చేసాయ్

ఒకటా రెండా ఇన్ని వేల ప్రాణాలు

పట్టుకుపోయి ఏ స్వామి గుమ్మానికి తోరణాలల్లుతున్నాయో...

కళ్ళ ముందే అయినవారి ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటే

ఏమి చేయలేని వారిగుండె కోత.... ఒకరి కన్నకొడుకు,

ఒకరి కన్నతల్లి, మరొకరి భార్య, ఇంకొకరి భర్త

ఇలా బంధాలని, అనుబంధాలని తెంచుకుని నీటిలో కలిసి పోయాయ్...

కన్నీరుని మిగిల్చిపోయాయ్...

ఏ "నాథుడు"

ఆ అవిసిన గుండెల భాదని

తీర్చలేదు... తీర్చలేడు.