Facebook Twitter
చిరు చిరు నవ్వులు

చిరు చిరు నవ్వులు


గానం : గీతిక బృందం,

ఏడవ తరగతి, టింబక్టు బడి,

చెన్నేకొత్తపల్లి. 

చిరు చిరునవ్వుల చిలకల్లారా
బంగరు పలుకుల మొలకల్లారా
మనసులు కలిసి మెలగండీ
మనుగడ కదిలీ మెదలండీ (??)           “చిరు చిరు”


గాంధీ తాత ఏమయ్యాడు?
మహాత్ముడై వెలుగొందాడు - ఎందుకని?
కొట్టిన వారికి కొట్టలేదులే
తిట్టిన వారిని తిట్టలేదులే
సమతా మమతా మనదన్నాడు
స్వాతంత్ర్యం సాధించాడు
గాంధీ తాతా జోహార్!
మహాత్మకూ మా జోహార్! “చిరు చిరు”


చాచా నెహ్రూ ఏమయ్యాడు?
ఏమయ్యాడు?
శాంతిదూతగా నిలిచాడు - ఎందుకని?
శాంతి పథమ్మే కాంతి మార్గమని
ప్రపంచమంతా చాటాడు
చాచా నెహ్రూ జోహార్!
ఎర్ర గులాబీ జోహార్!
శాంతి దూతకూ జోహార్!                       “చిరు చిరు”


భారతమాత ఏమంటోంది?- ఏమంటోంది?
క్రమశిక్షణతో నడువంటోంది
నడువంటోంది
మీరే జాతికి పునాదులు
నీతికి నిజానికి రారాజులు
మంచిని మీలో పెంచండి
మనమంతా ఒకటని చాటండి
భారతమాతా జిందాబాద్!
చల్లని తల్లికి జిందాబాద్!
అన్నపూర్ణకూ జిందాబాద్!                  “చిరు చిరు”



కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో