Facebook Twitter
గీటురాయి...!

 

గీటురాయి...!

ఏ గీటురాయితో గీసి చూస్తావో చూడు గుండెని,
నేనన్నది,నేనున్నది...నీవన్నది,నేవిన్నది
అన్నీ ఒకటేనన్న ఆత్మీయ మైమరపు
లిప్తకాలమని తెలిసాక!
వేకువకై ఎదురు చూసే
విరజాజి పువ్వుని
అరచేత కోసిన బాధ
అనుభవమేనా ఎప్పుడైనా...
ఆ గీటురాయికి?!

రెక్క తెగిన బాధ పడ్డ
పావురాయి!
నా రెండు కనుల్లో రివ్వున ఎగసొచ్చిన ఆ అనుభవాల పేరేంటో..
తెలిస్తే చెప్పవూ?
ఆ క్షణం కలిస్తే తెలుపవూ???!!!

 

 

 

---Raghu Alla