నేను (కవిత)
నేను
.jpg)
ఉదయం తలుపు తెరవగానే
నవ్వుతూ పలకరించిన గులాబీల్లో
నా పసితనాన్ని మళ్ళీ ఎపుడైనా వెతుక్కున్నానా?
నాకేం ఇష్టం?
తెంపినా సంపూర్ణంగా నవ్వుతున్న పూలలోని అమాయకత్వం ఇష్టం
సూరుమీంచి జారుతున్న చినుకుల్లో చినుకునై కరిగిపోవటం ఇష్టం
గాలి గొంతుకై స్వరాన్ని ఆలపిస్తున్నపుడు హృదయం వింటుంటే తరించటం ఇష్టం
నేను నా నుంచి దూరమై ఎన్నాళ్ళయింది?
కల్మషం లేని నవ్వుని చూసి ఎపుడైనా
తృప్తి పడుతున్నానా?
తింటున్నపుడు రుచి మనసుకు నచ్చటం
ఈ మధ్యకాలంలో ఫీలయ్యానా?
నేను నాలా ఉండటం మానేసి ఎంతకాలమైంది?
ఏమో ..
నాకు నేనే లేనపుడు
అసలు ప్రపంచంతో ఒరిగిందేమిటి చెప్పు.
(నీ మనసులో నువ్వే లేనపుడు ఇంకెన్ని ఉన్నా వృథానే కదూ! Be you)
.jpg)
....... సరిత భూపతి



