Facebook Twitter
ప్రేయసి జన్మదినం

ప్రేయసి జన్మదినం

 

 

మొదటిసారి నీ మాట విన్నప్పుడు మీఅమ్మ ఎంత ఆనందంగా ఉందో,
నీతో మాట్లాడిన ప్రతిసారి నేను అంత ఆనందంగా ఉంటాను..
నీతో తొలి అడుగు వేయించడానికి మీ నాన్న ఎంత ఆరాట పడ్డారో;
నీతో ఏడడుగులు వేయడానికి నేనంత ఆరాటపడుతున్నాను..
నీ జననం వాళ్ళకి అద్భుతం..
నీ పరిచయం నాకు అదృష్టం..
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈరోజు నాకు ప్రత్యేకం..
ఎందుకంటే ఈరోజు నీ జన్మదినం..
నీ జన్మదినానికి నేను ఏదైనా ఇవ్వాలి.. కాని నేనే నిన్ను ఒకటి అడుగుతున్నాను..
నాకో మాట ఇస్తావా..
"జన్మ జన్మలకి నాతో ఉంటావో లేదో తెలీదు కాని.. ఈ జన్మకి నాతో ఉండిపోయి..
నీ ప్రతి జన్మదినం నాతో జరుపుకో".. మాట ఇస్తావు కదా..
నీ జన్మదినానికి నేను కోట్లు ఖర్చు పెట్టలేకపోవొచ్చు..
కాని కొవ్వొత్తుల వెలుగులో నీ ముఖం మీద స్వచ్ఛమైన నవ్వు తెప్పించగలను..
ఎందుకంటే ఆ నవ్వంటే నాకు చాలా ఇష్టం...
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ 
నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,
జన్మదిన శుభాకాంక్షలు.

- గంగసాని