పూలవనం
పూలవనం
తోటలో నాలుగు పూలు పూసాయి
ఎవ్వరూ గుర్తించట్లేదు
తోటమాలి చూసినట్టున్నాడు
నేనూ చూసాను
ఇప్పుడు పూలవనం అంతా నాలో నిండింది
పాపను చూసా
తోటలో పూలు నవ్వినట్లుగా అనిపించింది..
రోడ్డుపక్కన బిచ్చగాడిని చూసా
తోటనిండా పూలు రాలినట్టున్నాయి..
ఎటు చూసినా పూలవనమే
ఏ వైపుకి వెళ్ళినా పూలవనమే
ఎవరితో మాట్లాడినా పూలవనమే
నాతో ఉన్న పూలవనం
నా చుట్టూ ఉన్నట్లున్న ఈ పూలవనం
నా స్నేహితులకు కూడా పంచాలి
పాపం వాళ్ళు పూలనవ్వుల్ని ఎప్పుడూ చూసి ఉండరు
పూలవనం ఎంత అందమైనదో
అందాన్ని పరిమళంతో పోల్చిన
ప్రతీసారీ
పుప్పొడి లా పొంగిపోతూనే ఉంటుంది..
ఎంత కమనీయం
ఎంత సుగంధీయం
ఎంత కోమలం
ఈ పూలవనం రోజంతా నాలోనే నాతోనే..
✍🏻. దాసరి మల్లేశ్
