Facebook Twitter
డైరీ...

 

 

డైరీ..

 

 

చానాళ్లకు వచ్చింది,
కొన్ని తెల్ల పేజీల పుస్తకాన్నిచ్చి
తన గురించేదైనా రాయమంది..!
చిరునవ్వు తో మొదటి పేజీపై
తన పేరు రాసా...
స్వచ్ఛమైనా తెల్ల కాగితాలనంతే వదిలి..!

నా గురించి నన్ను రాసుకోమనిందీ సారి
కొన్ని రోజులాగి చూపించా..
చెమట మరకలనుకుంటాను అనింది,
అవునది..
మనసుకు పట్టిన చెమటే
అది కన్నీరని తెలియ కూడదుగా మరి..!

సర్లే ఇక నాకెందుకు నువ్వుంచుకోలే
ఆ మరకల తెల్ల కాగితాలను అనింది..!
ఇకంతే,
అదంతే,
నా 'కలా' మిగిలిపోయింది!!
నేటికీ..తన పేరుతో మొదలై,
నా సంతకంతో ముగిసే
"డైరీ" లా...!!!

- రఘు ఆళ్ల