Facebook Twitter
శ్మశానపు వాకిలి

శోక సంద్రం నీది
లోక స్వప్నం అది
విశ్వమంతా మూగబోయిన ఎండుటాకులను
రాల్చుతుంది...
నీ శ్వాస ఆగే చివరి క్షణాలు వెళుతున్నట్టుగా
దేహం ఊగిసలాడుతుంది
నెమలి నాట్యం విస్తుపోతుంది..
గాలి గానం నిశ్శబ్ధమవుతుంది
ఊయలలో ఊగిన రోజులు కాస్తా
ఊరిచివర మర్రిచెట్టులా
శ్మశానంలో కర్రముక్కల మధ్యలో
దహనం అవుతుంది దేహం
ఇదే శ్మశానం తాలుకా స్వప్నం
మనిషిని ప్రశాంతంగా ఉంచే పవిత్ర స్థలం
ఆప్యాయతల సంకెళ్ళు దగ్ఘమవుతున్న కట్టెల్లో
కరిగిపోతాయి...
నీకో ముక్తి..
ప్రపంచంతో విముక్తి లభిస్తుంది..
ఇప్పుడు నీ దేహం ఓ కోవెల...
అదే శ్మశానపు వాకిలి..

- Malleshailu