Facebook Twitter
అమ్మ అను పిలుపు తప్ప..

ఎంతగానో మురిసిపోయాను 
తొలివేడి స్పర్శతో 
ఎంతగానో మెరిసిపోయాను 
చనుబాల తీపితో 
ఎంతగానో పరవశించాను
జోలాలి పాటతో 
ఎంతగానో పొంగిపోయాను 
ఎనలేని ప్రేమతో

నీ అనురాగం అధికము 
ఈ అనుబంధం శతకము

మరు జన్మకు కారణం నీవు 
మరు అమ్మకు కారణం నీవు 
అమ్మలకు జన్మలకు కారణమైన అమ్మా 
ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం 
అమ్మ అను పిలుపు తప్ప

రచన : వెంకు సనాతని