జీవోలతో కేసుల నుంచి విముక్తి... ఏపీ సర్కార్‌పై కోర్టుకెళ్లిన వైసీపీ

Publish Date:Aug 2, 2017

Advertisement

ఏపీలో అధికార పార్టీ నేతలపై నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన జీవోలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమపై నమోదైన కేసుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టి వేయించుకోవటం షరామామూలే. అది ఏ ప్రభుత్వమైనా జరిగే తంతుమాత్రం ఇదే. ఈ కోవలోనే ప్రస్తుత అధికార టీడీపీ నేతలపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. పార్టీలపరంగా వైరమున్న ఘటనల్లో కేసులు నమోదవటం, ఎన్నికల సమయాల్లో మరికొన్ని, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఇంకొన్ని కేసులు నమోదవటంతో సదరు నేతలంతా వాయిదాలకు కోర్టులు, పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా నేతలపై నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం 132 జీవోలిచ్చింది. తద్వారా సుమారు 278 మంది నేతలు కేసుల నుంచి విముక్తులయ్యారు. 

 

ఇలా కేసుల నుంచి జీవోల ద్వారా బయటపడిన వారిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు ఉన్నారు. వీళ్లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇదంతా చట్టవిరుద్ధమంటూ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కోర్టుమెట్లెక్కింది. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై వరుస కేసులతో ముప్పతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే ఆర్కే... ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జీవోల ద్వారా కేసుల్ని ఉపసంహరించటం చట్టవ్యతిరేకమైన చర్యని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేయాలని పిటిషన్‌ వేశారు. దీనిపై వచ్చే మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

 

అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోన్న ఏపీ ప్రభుత్వం, చట్టాన్ని కూడా తనకు అవసరమైనట్లు మార్చుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ నేతలకు వెసులుబాటు కలిగేలా జీవోల ద్వారా కేసుల్ని ఉపసంహరించుకోవటం సరైంది కాదంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ఇచ్చిన జీవోలపై హైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.

 

అయితే అధికార పార్టీ నేతలు మాత్రం వైసీపీ వాదనను కొట్టిపారేస్తున్నారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో నాటి కాంగ్రెస్ నేతలు ఉద్ధేశ్యపూర్వకంగా పెట్టిన కేసుల్ని మాత్రమే ఉపసంహరించినట్లు నేతలు చెబుతున్నారు. రాజకీయంగా వేధింపులకు గురిచేసేందుకు తమపై పెట్టిన కేసుల్ని చాలా వరకూ కోర్టులు కూడా కొట్టివేశాయనీ, మిగతా వాటిలో ఆధారాలు లేని కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవటంలో తప్పులేదని అంటున్నారు. అయితే కేసుల్ని కొట్టివేస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోలపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకెళ్లడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.