కిరణ్ రాయల్ పై వైసీపీ ఆరోపణలు.. అంబటి, గోరంట్ల మాధవ్ లు గుర్తు లేరా?

Publish Date:Feb 10, 2025

Advertisement

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నుంచి ఆయనను దూరంగా ఉండాలని జనసేన అధేశించింది. పార్టీ తరఫున కిరణ్ రాయల్ పై  విచారణకు ఆదేశించడమే కాకుండా విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. 

ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలతో  జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కిరణ్ రాయల్ కూడా ఘాటుగానే స్పందించారు.  తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.   విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ అని స్పష్టంగా పేర్కొనడంతో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడం తాత్కాలిక నిర్ణయమేనని స్పష్టం చేసినట్లైంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో జనసేన చాలా పారదర్శకంగా వ్యవహరించిందనే చెప్పాలి. శనివారం సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ కు సంబంధించి వీడియోలు వైరల్ కాగానే.. జనసేన ఆయనపై విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టింది.   

అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ఓవర్ యాక్షన్ వెగటు పుట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారంలో వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా ఇష్టారీతిగా రెచ్చిపోతోంది. అదే సమయంలో  ఆ పార్టీలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ.. కిరణ్ రాయల్ విషయంలో మాత్రం జనసేనపై విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గతంలో వచ్చిన ఆరోపణలు, ఒక మహిళతో ఆయన అసభ్య సంభాషణ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అంబటి రాంబాబుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా, ఈ ఆరోపణల తరువాతే జగన్ అంబటిని మంత్రిగా ప్రమోట్ చేశారు. అదే విధంగా  ఆ పార్టీ మాజీ ఎంపీ  గోరంట్ల మాధవ్ విషయం కూడా అంతే. ఎంపీగా ఉండి ఆయన చేసిన ఛండాలం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. దీనిపై జగన్ ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా.. ఇప్పడు అదే గోరంట్ల మాధవ్ ను వైసీపీ జాతీయ అధికార ప్రతినిథిని చేసి అందలం ఎక్కించారు. 

ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో జనసేన విచారణకు ఆదేశించింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. విచారణలో ఆయన తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటుంది. కానీ అంత వరకూ ఆగకుండా వైసీపీ చేస్తున్న గగ్గోలు సిగ్గు చేటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.