సర్ పై విమర్శలు, బీజేపీ విధానాలపై మౌనం.. ఇదీ జగన్ రాజకీయ శైలి!

Publish Date:May 27, 2026

Advertisement

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓట్ల తొలగింపు అంశంపై తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీపై ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని మరోసారి చాటాయి.  ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన  ఎస్ఐఆర్  కారణంగానే కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షాలు నష్టపోయాయన్న జగన్, ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ని  కానీ, బీజేపీని కానీ పన్నెత్తు మాట  అనలేదు. ఎన్నికల ప్రక్రియలో  పెద్ద లోపం జరిగిందని వేలెత్తి చూపిన జగన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని వేలెత్తి చూపడానికి మాత్రం ధైర్యం చేయలేదు.  

బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన జగన్  పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఉదాహరణగా చూపుతూ.. ఎన్నికల సంఘం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల పశ్చిమ బెంగాల్‌లో సుమారు 91 లక్షల ఓట్లు, అలాగే తమిళనాడులో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగిపోయాయన్నారు.   ఈ ఓట్ల తొలగింపు కారణంగానే   అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పరాజయం పాలయ్యాయన్నారు.  

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్   కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన  ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్..  అలాగే..  తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు. 

దేశంలోని ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై జగన్  తీవ్రమైన ఆరోపణలు చేసిన జగన్..  దీని వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్రను కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు.  సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తాయి.. కానీ జగన్ కేవలం ఎన్నికల సంఘం వ్యవస్థాగత లోపాలే ఓట్ల తొలగింపునకు కారణమని విమర్శలు గుప్పించి  చేతులు దులిపేసుకున్నారు. 

గత కొంతకాలంగా వైఎస్ జగన్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో, ముఖ్యంగా ప్రధాని మోదీ నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన బుధవారం  (మే 27) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు బలం చేకూర్చాయి.  కేంద్ర ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శించేందుకు జగన్ సిద్ధంగా లేరని తాజా ప్రెస్ మీట్ మరో సారి నిర్ద్వంద్వంగా నిరూపించింది.  వ్యవస్థలను తప్పుబడుతూనే, కేంద్ర పెద్దలను నొచ్చుకోకుండా మాట్లాడటం జగన్ రాజకీయ శైలిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆయన రాజకీయ శైలిగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంను తీవ్రంగా విమర్శిస్తూనే.. ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసుల భయంతోనే జగన్ బీజేపీకి వంతపాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.