వైఎస్ ఫ్యామిలీకి ఇచ్చాపురం సెంటిమెంట్ 

Publish Date:Jan 23, 2024

Advertisement

వైఎస్ ప్యామిలీ కి  ఇచ్చాపురంతో విడదీయరానిబంధం ఏర్పడింది. 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంతో తేవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర  ఇచ్చాపురంలో ముగించారు. ప్రస్తుతం ఆయన తనయ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు వైఎష్ షర్మిల కూడా ఇచ్చాపురం నుంచే సుడిగాలి పర్యటనలు ప్రారంభించారు. 
ఎపిలో అన్నా చెల్లెల్ల రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యవేక్షణలో  వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారుకావడం, కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు షర్మిలసుడిగాలి పర్యటనలు ప్రారంభం కావడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తుంది.2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి కూతురుప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు అయ్యింది.కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు  వైఎస్‌ షర్మిల..విశాఖ వేదికగా యాక్షన్‌ ప్లాన్‌ స్టార్ట్‌ చేశారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను దాదాపుగా పూర్తి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ కూడా..విశాఖ నుండే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వేదికగా ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
వైసీపీ సర్కారుపై ఇప్పటికే పదునైన విమర్శలు చేసిన షర్మిల..ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యాటనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది. 
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజులపాటు రాష్ట్రంలో సుడిగాలిపర్యటన చేయనున్నారు.  ఈ రోజు ఉదయం  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో నేతలతో సమీక్షించారు. ఆ తర్వాత పార్వతీపురం చేరుకుని  మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షించారు. అనంతరం విజయనగరం చేరుకుని  జిల్లాపై సమీక్ష నిర్వహించారు. 

బుధవారం  విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, గురువారం  (25న) కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, శుక్రవారం (26న) తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు.  శనివారం (27న) గుంటూరు, పల్నాడు,  ఆదివారం (28న) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు సోమవారం(29న) తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,మంగళవారం(30న) శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, బుధవారం(31న) నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు.
వైసీపీ అభ్యర్ధుల ఎంపికను దాదాపు పూర్తి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌..త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు షర్మిల కూడా జిల్లాల పర్యాటనకు శ్రీకారం చుట్టడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో పూర్తిగా స్తబ్ధత ఏర్పడింది. అధిష్ఠానం పలువురు పీసీసీ నేతలను మార్చినప్పటికీ పార్టీ కేడర్‌లో ఏమాత్రం ఉత్సాహం నింపలేకపోయింది ఇప్పుడు వైఎస్‌ షర్మిల ఆ పరిస్థితిని మార్చి..ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తారని అధిష్ఠానం ఆశిస్తోంది.
సెప్టెంబరు 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని షాక్‌తో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించడం విశేషం. అప్పట్లో ఓదార్పు యాత్ర విజయవంతంగా కొనసాగింది. యాత్రతో సానుకూల ఫలితాలు సాధించి, నాలుగేళ్లలోనే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాతే 2019లో జగన్‌ సీఎం అయ్యారు. అంతకు ముందు మెగస్టార్‌ చిరంజీవి తన సొంత రాజకీయ పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి యాత్ర చేపట్టింది కూడా శ్రీకాకుళం నుంచే. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.