పవర్ లెస్ సీఎం ప్రెస్ మీట్ ని అడ్డుకున్నాడా?

Publish Date:Apr 29, 2019

Advertisement

 

విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలమయ్యారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నారు.

విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే వెనుదిరిగారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?"  అని జగన్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ఘటనపై వర్మ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్‌ ఎలా పెడతారు? అయినా నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ ఏంటి? ట్రాఫిక్ కి అంతరాయం కలగదా? అలా నడిరోడ్డు మీద మీటింగ్ పెట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరిదీ బాధ్యత? అంటూ వర్మ తీరుపై పలువురు మండిపడుతున్నారు.

పోలీసులు కూడా వర్మ ప్రెస్ మీట్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు. దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు.

ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలీసుల అనుమతి.. ఇలాంటివి పట్టించుకోకుండా వైఎస్ జగన్ వర్మకి సపోర్ట్ గా మాట్లాడడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని, పవర్ లెస్ సీఎం అని అన్నారు. ఆయనకసలు అధికారులు లేవని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చెప్పిందే వేదమని డైలాగ్ లు కొట్టారు. తీరా పోలీసులు ఎన్నికల కోడ్ పేరుతో వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే మాత్రం.. చంద్రబాబు సీఎం అని, టీడీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందా?. అయినా పవర్ లెస్ సీఎం ఓ ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకోగలడు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ, సీఎస్ చెప్పిందే వేదమని మీరే చెప్పారు కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇస్తారేమో అడగండి అంటూ పలువురు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.