జైలుకెళితే...జగన్ భవిష్యత్ ఏంటి..?

Publish Date:Jul 1, 2016

Advertisement

వరుస రాజకీయ ఎదురుదెబ్బలు..టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్..ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఇలా పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయి కాస్త సేద తీరదామని ఫ్యామిలీతో సహా ఫారెన్ టూర్‌కు వెళ్లారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి. కుటుంబంతో  నాలుగు రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారో లేదో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ ఆయన సతీమణి భారతీ పేర్ల మీదున్న ఆస్తులను అటాచ్ చేసింది. ఊహించని ఈ షాక్‌తో డీలా పడ్డ జగన్‌కు మరో పెను ప్రమాదం పొంచి ఉంది.

 

తన తండ్రి వైఎస్ రాజశేఖర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని జగన్‌పై  సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఆ కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దీనిపై న్యాయస్థానం ఇచ్చే తీర్పు అనుకూలంగా వస్తే ఓకే..అలా కాకుండా వ్యతిరేకంగా వస్తే జగన్‌ జైలుకెళ్లక తప్పదు. ఆ జైలుకెలితే ఏముందిలే మళ్లీ బయటకొచ్చేస్తారు కదా..? అని అనుకుంటే పోరపాటు. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ జైలుకెళితే ఆయన రాజకీయ భవిష్యత్ సమాధి అయినట్లే. ఏదైనా కేసులో నేరం రుజువై రెండేళ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడ్డ రాజకీయనాయకులపై అనర్హత వేటు పడుతుంది. అలాంటి వారు జైలు నుంచి విడుదల అయ్యాక ఆరేళ్ల వరకు పోటీ చేయటానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు క్రిమినల్ కేసులో నేరం రుజువై దోషులుగా తేలితే..ఆ క్షణం నుంచి పదవుల్లో కొనసాగటానికి అనర్హులవుతారు.

 

అక్రమాస్తుల కేసులో జగన్ దోషిగా తేలి..శిక్ష పడితే..ఆయనపై అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొంత కాలం ఎదురుచూడాలి. దీనిని ముందుగానే ఊహించిన జగన్ బీజేపీ ముందు సాగిలపడినట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో అంటకాగుతున్న బీజేపీ, మిత్రుడు..మిత్రుడే..రాజకీయం..రాజకీయమే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. అలా సొంతంగా బలపడాలనే బీజేపీ ప్రయత్నాలకు జగన్ అందివచ్చిన అవకాశంగా కనిపించారు. ఓ మొక్కను నాటి అది పెరిగి పెద్దదవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఫలాలు అందాలంటే చాలా రోజులు ఓపిక పట్టాలి. అదే రెడీ టూ ఈట్ స్టేజ్‌లో ఉన్న చెట్టు అందివస్తే ఇప్పడు కమలానికి వైసీపీ ఇలాగే కనిపిస్తోంది. జగన్ ఇబ్బందులే తమకు మేలు చేస్తాయనే భావనలో ఉన్నారు కమలనాధులు.

 

అటు జగన్‌ కూడా కేసుల నుంచి బయటపడేందుకు తన ఆప్తమిత్రుడు గాలి జనార్థన్ రెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నాడు. దానితో పాటుగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విజయసాయిరెడ్డికి ఇదే పని అప్పగించినట్లు లోటస్‌పాండ్ టాక్. ఇదంతా ఒక ఎత్తైతే జగన్ జైలు కెళ్లాల్సివస్తే వైసీపీని నడిపించడం అంత సులభం కాదు. సూపర్‌ఫాంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. గతంలో జగన్ జైలుకెళ్లినప్పుడు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి లాంటి వాళ్లు పార్టీని నడిపించారు. ఇప్పుడు వారు కూడా లేకపోవడంతో నాయకత్వలేమి స్పష్టం కనిపించి పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. సో.. ఒక్క తీర్పు ఒక వ్యక్తిని..ఒక వ్యవస్థను చిన్నాభిన్నం చేయబోతోందన్న మాట. అందుకే అలా జరగక్కుండా..తన రాజకీయ భవిష్యత్ సమాధి కాకుండా ఉండేందుకు జగన్ బీజేపీతో జతకట్టాలని అనుకుంటున్నారట..పనిలో పనిగా జ్యోతిష్యులను సంప్రదించి పరిష్కారం చెప్పమని వేడుకున్నారట.

By
en-us Political News

  
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.