నుదుట సింధూరం.. జగన్ ఆహార్యంపై సర్వత్రా చర్చ
Publish Date:May 13, 2026
Advertisement
భారత రాజకీయ వ్యవస్థ వేగంగా పరివర్తన చెందుతోంది. రాజకీయ వాతావరణం ఇప్పుడు హిందూ వాదం వైపు బలంగా మొగ్గు చూపుతోంది. వాస్తవానికి బీజేపీ ద్వారా మొదలైన ఈ పవనం, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకూ విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఆయన ఇటీవల తన నుదుటిపై సింధూర తిలకంతో బహిరంగంగా కనిపించారు. జగన్కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా.. మతం, మతతత్వ రాజకీయాల పేరుతో జగన్ పలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇటీవలి కాలంలో తరచూ హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు నుదుటిపై సింధూర తిలకంతో బహిరంగంగా కనిపిండం.. హిందూ సమాజంతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పేందుకు చేసిన బలమైన ప్రయత్నంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో లేదా ఆలయాల సందర్శనలో మాత్రమే.. జగన్ తాను హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నించేవారు. ఆయా సందర్భాలలో జగన్ పొడవాటి నామంతో కనిపించేవారు. ఆయా సందర్భాలలో.. కేవలం ఓట్ల కోసమే ఈ వేషధారణ అంటూ జగన్ నెటిజన్లకు టార్గెట్ గా మారి ట్రోలింగ్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా గుండ్రటి సింధూర బొట్టుతో కనిపించడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతున్నది. గత ఎన్ని కలలో ఘోర పరాజయం తర్వాత జగన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సింధూర ధారణను ఆశ్రయించారా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై నెటిజన్లు సిస్టమ్ అప్డేట్ అయినట్లుంది, నామం పోయి బొట్టు వచ్చిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vermilion-on-the-forehead-45-219610.html





