అసోం ఎన్నికల బరిలో యువశక్తి ఉరకలు.. నవతరం రాజకీయ పరుగులు

Publish Date:Mar 31, 2026

Advertisement

 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.  

అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు.

నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది.

గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  

By
en-us Political News

  
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.