ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి.. కుల రాజకీయాలకు తెరలేపిన జగన్.!
Publish Date:Aug 14, 2026
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్రేషన్ లో ఉన్నారా? ఆ కారణంగానే కుల రాజకీయాలకు తెరలేపి రాజకీయ లబ్ఢి పాందాలని ప్రయత్నిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తుండటం, మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ తన పిలుపు మేరకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడంతో జగన్ లో ఫస్ల్రేషన్ పీక్స్ కు చేరిందని అంటున్నారు. అందుకే ఆయన కుల రాజకీయాలకు తెరలేపి లబ్థి కోసం అర్రులు చాస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఆయన వ్యూహాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. స్వయంగా జగన్ పైనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అన్న ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా పోలీసులు జగన్ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన కేసుల వచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ అరెస్టులు, న్యాయపరమైన చర్యలు జగన్ లో అసహనాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. పార్టీ నేతలకు మద్దతుగా మాట్లాడే క్రమంలో జగన్ హద్దు మీరుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టుల విషయంలో జగన్ కుల రాజకీయాలకు తెరలేపుతున్నారంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత విరూపాక్షిని జగన్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో జగన్ కర్నాలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విరూపాక్షను ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట జగన్ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను అణచివేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. నేరాలకు పాల్పడిన వారు అరెస్టైతే.. కులం పేరెత్తడమేంటని నెటిజనులు జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. వీడియో ఆధారాలతో సహా ప్రత్యక్షంగా నేరానికి పాల్పడినట్లు కనిపించిన సంఘటనల్లో నేరస్థులను వెనకేసుకు రావడానికి కులం కార్డు ఉపయోగించడం సరి కాదని విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేదే చట్టం ముందు ముఖ్యమని, కులాన్ని ఆధారం చేసుకుని నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడం సరి కాదనీ అంటున్నారు. . గతంలో వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో కూడా జగన్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి గుర్తు చేస్తున్నారు. Kurnool Jail, Virupakshi, Seediri Appalaraju, Andhra Pradesh politics, NDA government, TeluguOne News, Jagan casterelated remarks
http://www.teluguone.com/news/content/kurnool-jail-25-228903.html





