యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

Publish Date:Feb 25, 2026

Advertisement

ప్రేమ విఫలమై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఆ ఆత్మహత్యకు పాల్పడిన మహిళ యూట్యూబర్ కావడం గమనార్హం.  రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న  యూట్యూబర్ కోమలి, మణి కొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసు కుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్‌ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో   ప్రత్యేక మైన  గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూ బర్‌గా కొనసాగుతున్న అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలుగా కోమలి, అఖిల్ రెడ్డిలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తి బ్రేకప్ అయ్యారు.  అప్పటి నుంచి కోమలి  తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు  కాపాడినట్లు సమాచారం.

 రెండు రోజుల క్రితం కోమలి అఖిల్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడగా, ఇద్దరి మధ్య   వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపా నికి గురైన కోమలి   ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న  పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కోమలి ఆత్మహత్యతో  చిత్రపురి కాలనీలో విషాద వాతా వరణం నెలకొంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కోమలి అకాల మరణం ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.

By
en-us Political News

  
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్ తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి.
డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.