ప్రపంచానికి భారతీయ వరం యోగా దినోత్సవం!

Publish Date:Jun 20, 2025

Advertisement

శనివారం  జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.
 ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అగ్ర రాజ్యం అమెరికా సహా 177 దేశాలు, యోగ దినోత్సవం తీర్మానాన్ని సమర్ధించాయి. ఆ విధంగా 2015 జూన్ 21 న ప్రప్రథమంగా ప్రపంచ యోగ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యోగ దినోత్సవం 11వ వార్షికోత్సవం జరుపు కుంటోంది. 

నిజానికి యోగ అనేది  ఒక విద్య, వ్యాయయం మాత్రమే కాదు  భారతీయ జీవన విధానం.  భారతీయ ఋషులు  ప్రకృతి ధర్మాలకు తమ తపఃశక్తిని, మేథో సంపదను జోడించి  ప్రపంచ మానవాళికి అందించిన అపూర్వ కానుక యోగ విద్య. భారతీయ ఋషి పుంగవుల విశాల దృక్పథానికి, వందల వేల సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా లభించిన పవిత్ర విద్య, దివ్య ఔషదం యోగ విద్య. ఆ మహోన్నత విద్య మరుగున పడిపోకుండా..ముందుకు తీసుకుపోయే  సంకల్పంతో  ప్రధాని మోడీ మానసిక పుత్రికగా జన్మించి, ప్రపంచ ఆమోదం  పొందిన యోగా దినోత్సవం పదేళ్ళ ప్రయాణంలో ఎన్నోమైలు రాళ్ళను దాటింది. 

అన్నిటినీ మించి, యోగా అంటే కేవలం సనాతన హిందూ ధర్మానికి సంబందించిన  విద్య.. హిందువులు మాత్రమే ఆచరించే మతపరమైన విధి అనే అపప్రద ఈ పదేళ్ళ కాలంలో  చాలా వరకు తొలగి పోయింది. యోగ  ఒక మతానికి పరిమితం కాదు, ఒక ధర్మానికి, దేశానికి, ప్రాంతానికి పరిమితం కాదు. సర్వ మానవాళికి సంబంధించిన  ప్రశాంత ఆరోగ్య జీనన  విధానం యోగ అనే భావనను ఈరోజున ప్రపంచం విశ్వసిస్తోంది. అందుకే..  ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు ఉన్నాయో, అన్ని మతాల వారు, అన్ని ధర్మాల వారు  యోగా  దినోత్సవంలో  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పాల్గొనడమే కాదు.. యోగ విద్యను  నిత్య జీవితంలో సాధన చేస్తున్నారు.

 ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాచుర్యం కారణంగా కావచ్చును  ఈరోజున ఆధునిక ఆలోపతి వైద్య శాస్త్రం కూడా.. ముందెన్నడూ లేనంతగా యోగ సాధనను ప్రోత్సహిస్తోంది. అవును  అనేక దీర్ఘ కాలిక వ్యాధులకు, ఔషధాలు, శస్త్ర చికిత్సలతో పాటుగా (కొన్ని కొన్ని సందర్భాలలో ప్రత్యాన్మాయంగానూ కూడా) యోగ సాధనను, డాక్టర్లు  ప్రిస్క్రెబ్  చేస్తున్నారు. ఒక్క వైద్య శాస్త్రంలో మాత్రమే కాదు.. మేనేజిమెంట్ స్టడీస్, ఇతరత్రా క్షేత్రాలలో సైతం యోగ  విద్య, యోగ సాధన అంతర్భాగంగా మారి పోయాయి.నిజానికి, ఈ రోజున సినిమా హీరోలు, హీరోయిన్లు,ఇతర సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు డైలీ వర్కవుట్ లో యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.   అదలా ఉంటే ఈ సంవత్సరం జరుపుకుంటున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఒకటి కాదు, ఇంకా ఎక్కువే ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సం కూడా  యోగా దినోత్సవాన్ని ఓ చక్కని థీమ్ తో జరుపుకోవడం జరుగుతోంది. అవును..  ప్రధానమంత్రి నరేందమోదీ నెలనెలా ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను పంచుకునే, మన్ కీ బాత్  కార్యక్రమంలో 2025 యోగా దినోత్సవం కోసంగా ప్రటించిన, మకుటం యోగా ఫర్ వన్ ఎర్త్ .. వన్ హెల్త్  థీమ్ గా ఈ సంవత్సరం  యోగా దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకుంటోంది. అలాగే ఈ సంవత్సరం మన విశాఖ పట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి,నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా పాల్గొంటున్నారు.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.