కేసీఆర్ మెడకు చుట్టుకున్న టెలిఫోన్ ట్యాప్ వైర్?

Publish Date:Jun 20, 2025

Advertisement

గోనె ప్రకాశరావు వర్షెన్ ఏంటి?

కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం. 

 ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లు గా మారడంతో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చేస్తోందని అంటున్నారు. మాజీ డిజిపి చుట్టూ కథ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కథ వెనుక ఉన్నది కెసిఆర్, వారి కుటుంబ సభ్యులేనంటున్నారు. 

ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడవసారి. గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు విజయం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది. ఇండియాలో 1988లో కర్ణాటక లో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత 2023లో కెసిఆర్  ఈ కేసులో ఇరుక్కున్నారు.  

గోనె ప్రకాశరావు అప్పుడెప్పుడో 1983లో సంజయ్ విచార మంచ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. వై.ఎస్. హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. అంతకు మించి ఆయన ఏమీ చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా తన మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నారు. శుక్రవారం (జూన్ 20) సిట్ విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులోంచి కెసిఆర్ ను ఎవ్వరూ కాపాడలేరని ఆయన జోస్యం చెప్పేసారు. ప్రభాకరరావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తరువాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు. 

ప్రధాని కావాలనే లక్ష్యంతో కెసిఆర్.. పార్టీని బిఆర్ఎస్ గా మార్చి చుట్టు పక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ, ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని అన్నారు గోనె ప్రకాశరావు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్లే.. ఇప్పుడిలా ఇరుక్కుపోయారని ఆయన వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బిజెపి నేతలు కృషి చేయాలని కోరారు. 

గోనె ప్రకాశరావుకు ఇక్కడే కాదు, అమెరికాలోనూ మన తెలుగు వారిలో విపరీతమైన క్రేజ్ ఉంది. తానా, అటా సంస్థలు నిర్వాహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాశరావు ప్యానెల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే. ప్రకాశరావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడివారు విని ఎంజాయ్ చేస్తుంటారు.

By
en-us Political News

  
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.