ప్రపంచ ఆరోగ్యానికి భారత్ కానుక.. యోగా!
Publish Date:Jun 20, 2022
Advertisement
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉదయాన్నే ఇంట్లోనో, పార్కుల్లోనో, ఒంటరిగానో, ఒక గ్రూప్‌గానో ధ్యానం, యోగా చేస్తుండడం గమనిస్తున్నాం. సెలవురోజుల్లో అయితే ఇది మరీ ఖచ్చితంగా ఒక సమయం అంటూ పాటిస్తున్నారు. వృత్తి, పని, సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, వొత్తిడుల నుంచి బయటపడేందుకు యోగా ఎంతో అవసరమని యోగా టీచర్లు, టీవీల్లో ప్రచా రకులు ప్రజలకు బోధిస్తూనే వున్నారు. యోగాను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దగ్గర మార్గంగా చూస్తున్న వారే ఎక్కువగా కనపడుతున్నారు. ఇదేదో కొత్తగా లోకంలోకి వచ్చినది కాదు. విదేశాల నుంచి దిగుమతి అయింది అంతకంటే కాదు. సుమారు మూడు వేల ఏళ్ల కిందనే ప్రాచీన భారతదేశంలో ఆరంభమయింది. పూర్వం రుషులు వారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిసామర్ధ్యాలు పెంపొందించుకోవడంలో దీన్ని గొప్ప మార్గంగా కనుగొని అనుసరించారు. అదే తరతరాలుగా అందుతున్న అద్భుతం. ఈ కాలానికి గొప్ప ఆరోగ్య సూ త్రంగా మారిందనీ అంటున్నారు. రోజూవారీ జీవితంలో దీనివల్ల గొప్ప ప్రయోజనం వుందని యోగా చేస్తు న్న వారి మాట. దీనివల్ల ఎవరికయినా సరే మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం పెరుగుతుం దని అనుభవ జ్ఞుల మాట. యోగావల్ల జీవితంలో ఆనందాన్ని మరింత చవిచూడగలమనీ అంటున్నారు. చాలాకాలం నుంచి డయాబిటీస్, మానసిక వొత్తిడి సంబంధిత జబ్బులకు లోనయి డాక్టర్లు, ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగెత్తినవారు యోగా ద్వారా ఆ బాధల నుంచి బయటపడిన ఉదాహరణలు కోకొల్లలు. చూడ్డానికి ఏదో వ్యాయామంలా కనిపించే యోగా నిజానికి మనిషి శారీరక, మానసిక దృఢత్వానికి వుపయోగ పడుతుంది. దీన్ని ఎవరయినా, వయసుతో నిమిత్తిం లేకుండా చేయవచ్చని యోగా గురువుల మాట. వేలాది సంవత్సరాలుగా భారత్‌కే యోగా పరిమిత మయిందన్న వాదన వుంది. ఈ ఆధునిక కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ఆదరణ పెరిగి దాదాపు అన్ని దేశాల్లోనూ అనుసరిస్తున్నారు. ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించడం, ప్రత్యేకించి యోగా గురువులను భారత్ నుంచి పిలిపించుకుని మరీ నేర్చు కోవ డం కూడా గత పాతికేళ్లుగా సాగుతోంది. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ప్రజలు విధిగా రోజూవారీ కార్యక్రమం గా యోగాను చేస్తుండడం ఎంతో అభినందనీయం. 2014 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితికి భారత ప్రధాని నరేంద్రమోడీ యోగా డే ను ప్రకటించమని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన గురించి ఐక్యరాజ్య సమితి 177 సభ్యదేశాల చర్చల అనంతరం భారత్ ప్రతిపాదనకు మద్దతు లభించింది. ఫలితంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా యు.ఎన్ ప్రకటించింది. 2015 లో మొదటి అంతర్జాతీయ యోగా డే పాటిం చారు. కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేలా చేసింది. అన్ని దేశాల్లోనూ అందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రజలు ఆరోగ్య రక్షణ విషయంలో ప్రత్యేక శ్రధ చూపాలని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. ఈ సమయంలోనే అత్యంత చౌకగా అందుబాటు లోకి వచ్చిన గొప్ప ఆరోగ్య సూత్రం యోగా. యావత్ ప్రపంచంలోనూ యోగాను అనుసరించడం ద్వారా కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలను దూరం చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రజలు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందడుగు వేయడానికి యోగా ఎంతో సహకరించిందన్నది వింటూనే వున్నాం. కోవిడ్-19 విజృంభించిన సమయంలో డాక్టర్లు, ఆరోగ్య సేవకులు వూహించనంత శ్రమకు లోనయినా ప్రజారోగ్య రక్షణ విషయంలో విజయం సాధించడానికి కంకణం కట్టు కున్న యోధుల్లా పనిచేశారు. అంతేస్థాయిలో యోగా ఆ తదుపరి జీవనాన్ని సమస్యల రహితంగా చేయడా నికి మార్గదర్శకంగా నిలిచింది. మానవ బాధలతో పాటు, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ఆర్థిక, అభివృ ద్ధి నమూనాల అనేక కీలక దుర్బలత్వాలను కూడా హైలైట్ చేసిం ది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్నప్పుడు సభ్య దేశాలు విభిన్నంగా పునర్నిర్మించాలని భవిష్య త్తు శ్రేయస్సు కోరుతోంది. భూమి గ్రహానికి అనుగుణంగా స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి మానవాళి యొక్క సామూహిక అన్వేషణలో యోగా ఒక ముఖ్యమైన సాధనం. ఈ స్ఫూర్తికి అనుగుణంగా, ఈ సంవత్సరం యోగా డే వేడు కల థీమ్ మానవత్వం కోసం యోగా.
http://www.teluguone.com/news/content/yoga-a-gift-to-world-health-25-138027.html





