Top Stories

dummy

political-news-img

రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్ చేస్తాం : సీఎం చంద్రబాబు

జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘జలధార’తో రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడదామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా, యాడికిలో ‘జలధార..నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రూపొందించిన యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ....నీరు మనందరికీ సర్వస్వమని, నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నాం. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి..నిలబడిన నీటిని జలాశయంలో చేసేందుకు ప్రయత్నించాలి. నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాలకు వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదు. నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చాం. 90 శాతం మేర సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో మేమే. మైక్రో ఇరిగేషన్‌పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారింది. హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూర్వోదయతో సీమ అభివృద్ధి రాయలసీమ అభివృద్ధికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామని, కేంద్రం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకం ద్వారా రూ.30 వేల కోట్లు వస్తాయన్నారు. ‘పెట్టుబడులు ద్వారా మరో రూ.70 వేల కోట్ల రాబట్టి అభివృద్ధి చేస్తాం. గడిచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయి. చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం. జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భ జలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం. గత ఏడాది వేసవి ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. చేపట్టిన భూసంరక్షణ చర్యల కారణంగా 2.2 మీటర్ల మేర జలాలు పెరగటం సంతోషం కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లాల్లో దీనిని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి విజయం సాధించారు. ఈ ఉద్యమంలో ప్రజలందరికీ నేను తోడుగా ఉంటాను. జిల్లాలో 5.7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. 20 వేలకుపైగా ఎండిన బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చింది. ఒక్క జిల్లాలో రూ.96 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యింది. భూగర్భజలాలు పెరగటం మూలంగా హరిత ప్రాంతం పెరిగింది. ఇవన్నీ సానుకూలమైన అంశాలు’ అని ముఖ్యమంత్రి అన్నారు. రబీ, ఖరీఫ్‌కు సమృద్ధిగా నీరు వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతున, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. తద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చని అన్నారు. ‘‘రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉంటే ఎప్పటికప్పుడు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం నీటిని వేర్వేరు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నాం. రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. మొత్తంగా 1300 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంటుంది. ఈ ఏడాదిలో 74 టీఎంసీల నీరు అనంతపురం వరకూ తీసుకువచ్చాం. హంద్రీనీవా ద్వారా చిట్టచివరి భూములకు కూడా నీరు తీసుకెళ్లాం. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి రబీకి, ఖరీఫ్‌కు ఇచ్చే నీటిని ఆదా చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాం. భూమినే జలాశయంగా మార్చుకుని వినియోగించు కోవటం ద్వారా మెరుగైన నీటి నిర్వహణ చేపట్టవచ్చు. రబీ, ఖరీఫ్ పంటలు పూర్తి అయ్యాక కూడా ప్రస్తుతం మన రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వ ఉంది. దేశంలోనే అతితక్కువ వర్షపాతం పడే అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా ఎక్కువ పండ్ల తోటలతో సంపన్నమైన ప్రాంతంగా మారిందని అన్నారు. గత పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచారని, రూ.1.24 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని అన్నారు. కూటమి వచ్చాక గత ప్రభుత్వం పెంచిన సుమారుగా రూ.4,400 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. అలాగే తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పిచ్చి ముదిరి మావిగన్ మాటలు గత పాలకులు రాష్ట్ర ప్రజలకు అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. ‘గతంలో మూడు ముక్కలాట ఆడారు. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికారు. ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది. పిచ్చి ముదిరి మావిగన్ అంటూ కొత్తపేరు తీసుకొచ్చారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు మావిగన్ అంటున్నారు. బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. చూసి సహించలేక ఫ్రస్టేషన్‌తో అవినీతి జరిగిందని అంటున్నారు. 2047 నాటికి ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాం. దీనికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ గోదావరి వరకూ విశాఖ, ప్రకాశం- నెల్లూరు వరకూ అమరావతి, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి రీజియన్లుగా తయారవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు గత పాలకులు రాష్ట్రంపై పగపట్టారని, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతీ జిల్లాను అభివృద్ధి చేస్తున్నాం. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వనిదే. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదం నాణ్యతను దెబ్బతీశారు. కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేశారు. రాష్ట్రంపై విద్వేషం చూపించే వారికి సహకరిస్తే పౌరులందరికీ నష్టం కలుగుతుంది. పెట్టుబడులు తీసుకువస్తుంటే వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి వారిని దూరం పెట్టాలి. కరెంటు, నీరు లాంటి దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించుకుందాం. అందరికీ సమర్ధవంతమైన, జవాబుదారీ పాలన ఇవ్వాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రమే నా కుటుంబం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా చేయూత అందిస్తున్నాం. పెట్టుబడులు వస్తే.. ఆదాయం వస్తుంది అప్పుడే సంక్షేమం చేయగలం. సుపరిపాలనకు ప్రజలంతా సహకరించాలని’ చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల ముందే ప్రజంటేషన్ అనంతపురం జిల్లా, తాడిపత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను యాడికి జలధార సభలో ముఖ్యమంత్రి చదవి వినిపించారు. వివిధ శాఖల పనితీరు నివేదికలను ప్రజల ముందు ప్రజెంట్ చేశారు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగు పర్చుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని... అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. భూవివాదాలనేవి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. ట్రాక్టర్లల్లో ఇసుక తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా..? అని ప్రజలనే నేరుగా సభలో సీఎం అడగ్గా... ఎవ్వరూ అడ్డుకోవడం లేదని ప్రజలు బదులిచ్చారు. దీనికి సీఎం స్పందిస్తూ...ఆదాయం తగ్గినా పర్వాలేదనుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. బాగా పని చేసిన అధికారును అభినందించాలంటూ ప్రజలతోనే సభలో చప్పట్లు కొట్టించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా సూపర్ అచీవర్స్.. అచీవర్స్.. పెర్ఫార్మర్స్.. లెర్నర్స్ గా విభజిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. కొందరు అధికారులు గైర్హాజరు కావడంతో...ఇకపై తాను వచ్చే ప్రతీ సభకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం హాజరవ్వాలని ఆదేశించారు. జై అమరావతి అంటూ నినాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు జలధార కార్యక్రమంలో ప్రజావేదిక సభకు వచ్చేముందు ప్రజలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా అమరావతి లోగో పట్టుకుని సభకు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. యాడికిలో సీఎం హెలిక్యాప్టర్ దిగాక అమరావతి బ్యాడ్జిని అందించారు. సభలో రాజధానికి చట్టబద్దతపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రం మీద పగ పట్టినట్టు వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. ఫ్యాక్షనిస్టులు, ముఠా నాయకుల కంటే ఘోరంగా రాష్ట్రాభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. సభ అనంతరం పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత ఆమోదానికి గుర్తుగా సీఎంకు అమరావతి జ్ఞాపికను జేసీ పవన్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఎంపీలు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగానికి ముందు ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. నీటి సంరక్షణకు అనంతపురం జిల్లా, నియోజకవర్గంలో చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వివరించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఫొటో ఎగ్జిబిషనులో అధికారులు ప్రదర్శించారు. డ్వాక్రా, స్థానిక మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్‌ను, గ్రానైట్, డొలమైట్, సున్నపురాయి గనులకు సంబంధించిన స్టాల్ ను సందర్శించారు. హార్టికల్చర్ ఉత్పత్తులను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

Publish Date: Apr 6, 2026 7:53PM

political-news-img

ఢిల్లీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది. కఠిన భద్రత మధ్య, ముసుగు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కారుతో వి.వి.ఐ.పీ గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించడం భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన తెల్లటి టాటా సియెర్రా ఎస్‌యూవీ అసెంబ్లీ గేటు నెంబర్–2 వద్దకు అత్యంత వేగంగా చేరుకుంది. సాధారణంగా కఠిన అనుమతులు ఉన్న వాహనాలకే అనుమతి ఇచ్చే ఈ గేటును, ముసుగు ధరించిన వ్యక్తి ఇనుప గేటు, బూమ్ బారియర్‌లను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లాడు. లోపలికి వెళ్లిన అనంతరం, ఆ వ్యక్తి కారు దిగి అసెంబ్లీ పోర్చ్ ప్రాంతానికి చేరుకుని, స్పీకర్ విజేందర్ గుప్తకు చెందినదిగా భావిస్తున్న వాహనం వద్ద ఒక పూల బొకే ఉంచాడు. వెంటనే తిరిగి కారులోకి చేరి, వచ్చిన వేగంతోనే భద్రతా ఏర్పాట్లను దాటుకుంటూ బయటకు పారిపోయాడు.ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు వెంటనే హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు, ఫోరెన్సిక్ బృందాలు అసెంబ్లీ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనలో ఉపయోగించిన కారు సర్బ్జిత్ సింగ్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనం యజమానే నడిపాడా? లేక మరెవరైనా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.సెంట్రల్ రేంజ్ స్పెషల్ కమిషనర్ అనిల్ శుక్లా, లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర యాదవ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన కారు, సుమారు 2:15 గంటల సమయంలో ఓ రిక్షా కార్మికుడిని ఢీకొట్టినట్లు సమాచారం. బాధితుడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. నిందితుడి ప్రయాణ మార్గాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పగటిపూట, సాయుధ భద్రత మధ్య ఉన్న అసెంబ్లీ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి ఒక వ్యక్తి కారుతో ప్రవేశించి, తిరిగి సులభంగా బయటపడటం భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. నిందితుడు అక్కడ బొకే ఎందుకు ఉంచాడు? ఇది నిరసనా? వ్యక్తిగత సందేశమా? లేక భద్రతా వ్యవస్థను పరీక్షించడానికేనా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Publish Date: Apr 6, 2026 7:34PM

political-news-img

మొయినాబాద్ ఫామ్ కేసులో వాదనలు ముగింపు...తీర్పు రేపటికి వాయిదా!

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. నిందితులు ఇప్పటికే సుమారు 20 రోజులుగా జైలులో ఉన్నారని, పోలీసులు ఇచ్చిన రెండు విడతల కస్టడీలో మొత్తం ఆరు రోజుల పాటు విచారణకు పూర్తిగా సహకరించారని వారు వాదించారు. ఇకపై కస్టడీ అవసరం లేదని, బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్‌కు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు వివరించారు. నిందితుల నుంచి ఇంకా అనేక కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. విచారణకు నిందితులు పూర్తిగా సహకరించలేదని కూడా పేర్కొన్నారు.అదనంగా, రితీష్ మరియు రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

Publish Date: Apr 6, 2026 7:17PM

political-news-img

పాతబస్తీలో హైడ్రామా…ఎంఐఎం ఎమ్మెల్సీపై కేసు

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా అధికారులతో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఎంఐఎం ఎమ్మెల్సీతో పాటు కార్పొరేటర్‌పై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పాతబస్తీలోని హుస్సేనాలెం సమీపంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఎంఐఎం నాయకులు కూల్చివేతలను అడ్డుకుంటూ నానా హంగామా చేశారు... దీంతో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూల్చివేతల సమయంలో అక్కడికి వచ్చిన మజ్లీస్ నాయకులు అధికారుల విధుల్లో ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు ఎమ్మెల్సీతో పాటు స్థానిక కార్పొరేటర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబం ధించి ఘాన్సీ బజార్‌కు చెందిన ఎఐఎంఐఎం ఇన్‌చార్జ్ సాహిల్ అక్బర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. కేసు విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Publish Date: Apr 6, 2026 6:20PM

political-news-img

ఏపీలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం... 69 మంది ఉద్యోగుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL)లో అర్హత లేకుండా అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను సేవల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఐటీఐ ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేయకపోయినా పూర్తి చేసినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఈ ఉద్యోగులు విధుల్లో చేరినట్లు విచారణలో బయటపడింది. కొంతకాలంగా వీరి విద్యార్హతలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ అంతర్గతంగా దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఉద్యోగాలు పొందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసి, సదరు ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించారు. జిల్లాల వారీగా తొలగింపులు: కడప జిల్లా – 38 మంది కర్నూలు జిల్లా – 16 మంది చిత్తూరు జిల్లా – 4 మంది నెల్లూరు జిల్లా – 4 మంది తిరుపతి జిల్లా – 3 మంది అనంతపురం జిల్లా – 3 మంది అన్నమయ్య జిల్లా – 1 వ్యక్తి మొత్తం 69 మందిపై చర్యలు తీసుకోవడం ద్వారా అక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ వంటి సాంకేతిక, ప్రమాదకర రంగంలో అర్హతలేని వ్యక్తులు పనిచేయడం భద్రతకు ముప్పుగా మారుతుందని వారు హెచ్చరించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ మీసేవ కేంద్రాల ద్వారా పోలీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తప్పుడు సమాచారం ఇచ్చినా, క్రిమినల్ రికార్డులు ఉన్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాదు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నారు. నియామక ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజెన్సీలపై కూడా నిఘా పెంచారు. ఈ చర్యలతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన మరికొంతమందిలో భయం నెలకొంది.

Publish Date: Apr 6, 2026 5:56PM

political-news-img

వేసవి కాలంలోనూ శంఖు పువ్వులు బాగా పూయాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం , తెలుపు రంగులో ఉంటాయి. ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు. ఈ పువ్వులు సంతోషం, శ్రేయస్సు, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో ఈ తీగ ఎండిపోవడం మొదలై, పూయడం ఆగిపోతూ ఉంటుంది. చాలా మంది వేసవిలో శంఖు పుష్పం మొక్క ఇక పువ్వులు పూయదు ఈ సీజన్ లో అనుకుంటారు. అయితే గార్డెనింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మొక్కకు మార్చి, ఏప్రిల్ నెలలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. కొన్ని చిట్కాలు పాటిస్తే శంఖు పుష్పం మొక్కకు పువ్వులు చక్కగా పూస్తాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. శంఖు పుష్పం మొక్కకు మార్చి, ఏప్రిల్ నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తీగను కత్తిరించడం చాలా అవసరం. పాత, ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన కొమ్మలను కత్తిరించాలి. ఇది మొక్క కొత్త కొమ్మలను చిగురించడానికి ప్రోత్సహిస్తుంది. కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే, అది అంత ఎక్కువగా పువ్వులను పూస్తుంది. శంఖు పుష్పం తీగ కుండీలోని మట్టి ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాతదైతే దానిని మార్చాలి. కాలక్రమేణా, మట్టిలోని పోషకాలు తగ్గిపోయి చాలా గట్టిగా మారుతుంది. కుండీ పైభాగంలోని 2 నుంచి 3 అంగుళాల మట్టిని తీసివేసి, దాని స్థానంలో కొత్త కంపోస్ట్ కలిపిన మట్టిని నింపాలి. ఇది మొక్క కొత్త వేర్లను బలపరిచి, వేగవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వేసవిలో శంఖు పుష్పం మొక్కకు తేమ మాత్రమే అవసరం. అధికంగా నీరు పోయడం మొక్కకు హాని కలిగిస్తుంది. వేసవి కాలంలో, ఆకులకు నీరు పోయడానికి స్ప్రే బాటిల్‌ను ఉపయోగించాలి. ఇది మొక్కను తేమగా ఉంచుతుంది. మట్టి పై పొర ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. శంఖు పుష్ప మొక్కకు సూర్యరశ్మి అంటే చాలా ఇష్టం. ఈ మొక్కకు కనీసం 5 నుండి 6 గంటల సూర్యరశ్మిని అందించాలి. ఒకవేళ ఈ మొక్క ఎక్కువ కాలం నీడలో ఉంటే, తీగ పొడవుగా పెరుగుతుంది కానీ పూలు పూయదు. శంఖు పుష్ప మొక్క కోసం మట్టిని సిద్ధం చేసేటప్పుడు, ఇసుక, వర్మీకంపోస్ట్ సరైన నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. నెలకు ఒకసారి మట్టిలో లిక్విడ్ ఆవాల పిండి ఎరువును కలపాలి. దీనివల్ల పూల సంఖ్య పెరగవచ్చు. ప్రత్యామ్నాయంగా ఆవు పేడ ఎరువును కూడా వేయవచ్చు. *రూపశ్రీ.

Publish Date: Apr 6, 2026 5:43PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img