కవిత టిఆర్ఎస్ పసుపు జెండా.. వ్యూహమేంటి?!

Publish Date:Jun 1, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సంచలనం రేగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఆమె 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీ పేరు కంటే కూడా, ఆమె ఎంచుకున్న పార్టీ జెండా రంగు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతోంది. కవిత తన  టిఆర్ఎస్ పార్టీకి  పసుపు  రంగును అధికారిక రంగుగా ప్రకటించడం సంచలనం సృష్టించింది.  పసుపు రంగు అనగానే అందరికీ గుర్తుకువచ్చేది తెలుగుదేశం పార్టీ. దీంతో రాజకీయ వర్గాల్లో రకరకాల కుట్ర సిద్ధాంతాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు గులాబీ జెండాతో నడిచిన కవిత, ఇప్పుడు పసుపు జెండాను ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనే దానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ వివాదంపై..  పసుపు రంగు ఎంపికపై వస్తున్న విమర్శలపై కల్వకుంట్ల కవిత తాజాగా ఒక   టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.  పసుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ..  ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం  కాదని   తేల్చి చెప్పారు. ఈ రంగు ఎంపిక వెనుక రాజకీయ వ్యూహాల కంటే బలమైన సెంటిమెంట్ దాగి ఉందని ఆమె వివరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు పసుపు రంగుతో విడదీయరాని,   ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని గుర్తు చేసిన కవిత..  నిజామాబాద్ జిల్లాలో పండించే ప్రధాన పంట పసుపు (టర్మరిక్) అని, అక్కడి రైతులకు, ప్రజలకు ఈ రంగుతో విపరీతమైన సెంటిమెంట్ ఉందని వివరించారు. ఒకప్పుడు తాను పార్లమెంట్‌లో నిజామాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించానని, తన భర్త దేవనపల్లి అనిల్ కుమార్ సైతం నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పోతంగల్ గ్రామానికి చెందినవారేనని చెబుతూ తన నిజామాబాద్ బంధాన్నిచెప్పుకొచ్చారు.

కేవలం రైతు సెంటిమెంట్ మాత్రమే కాదు..  పసుపు రంగు ఎంపిక వెనుక ఒక బలమైన మహిళా సెంటిమెంట్ కూడా ఉందని కవిత చెప్పారు. . ఒక మహిళగా పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు ప్రతి ఆడబిడ్డ  పసుపు కుంకుమ' ఆశీర్వాదాలను ఎంతో పవిత్రంగా భావిస్తుందని, పసుపు కుంకుమలను కోరుకుంటుందని  అన్నారు. అందుకే ఒక మహిళగా పసుపు రంగు తన హృదయానికి ఎంతో దగ్గరైనదని, అందుకే తన కొత్త తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీకి ఈ రంగును ఎంచుకున్నానని  స్పష్టం చేశారు.

కవిత ఇంతటి స్పష్టమైన,  భావోద్వేగ వివరణ ఇచ్చినప్పటికీ, రాజకీయాల్లో ఈ పసుపు రంగుపై సాగుతున్న మైండ్ గేమ్స్ అంత సులభంగా ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా బిఆర్ఎస్   శ్రేణులు ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో..  కేసిఆర్ సొంత రక్తమైన కవితను చంద్రబాబు ఏజెంట్ అని విమర్శించడం పరోక్షంగా కేసిఆర్‌ను అవమానించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.