పవన్ కల్యాణ్ కొత్త వ్యూహం.. జాతీయ స్థాయిలో ఫోకస్ పై దృష్టి!

Publish Date:Jun 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఆ తదననంతర పరిణామాలు  హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఎపిసోడ్ ఊహించని విధంగా పెద్ద వివాదంగా మారడంతో..  పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ రూట్‌ను మార్చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో..  పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.

అయితే  తెలంగాణ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్‌ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఫోకస్ కావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు పవన్ వరుసగా  జాతీయ మీడియా ఛానళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే నిదర్శనమంటున్నారు పరిశీలకులు. నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రాజకీయాలకో లేక ఆంధ్రప్రదేశ్ పరిణామాలకో పరిమితం కావడం లేదు. దేశవ్యాప్త ప్రాధాన్యత ఉన్న అంశాలు, జాతీయ ప్రయోజనాలపై ఆయన   గట్టిగా గళం వినిపిస్తున్నారు. పహెల్గాం ఉగ్రదాడి వంటి సున్నితమైన అంశాలపై జాతీయ మీడియాలో స్పందిస్తూ..  లౌకికవాదం పేరుతో కొందరు చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు.

 పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫోకస్ పై దృష్టి పెట్టారనీ,  తద్వారా పొలిటికల్ ఇమేజ్‌ను, జనసేన మైలుజ్ నును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ వివాదాల నుండి పుట్టుకొచ్చిన ఈ వేడిని, పవన్ కళ్యాణ్ తన జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఎటాక్  ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్లుగా..  ఒకవైపు తెలంగాణలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తూనే, మరోవైపు ఢిల్లీ స్థాయి ఫోకస్ సాధించడంపై ఆయన కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.