క్రెడిట్ చోరీ కోసమేగా వైసీపీ ఏడుపంతా?

Publish Date:Nov 7, 2025

Advertisement

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిడిట్ చోరీ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అయితే అసలు క్రెడిట్ చోరీ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ నవ్వుల పాలౌతున్నది ఆయననేనని తాజాగా మరోసారి రుజువైపోయింది. 

ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్.. సంక్షేమం, అభివృద్ధి, విపత్తు సమయాలలో ప్రజలను ఆదుకోవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ప్రజల మెప్పు పొందుతోంది. అదే సమయంలో జగన్ హయాంలో ఏం జరిగింది, ఆ ప్రభుత్వం ఎంత నిష్పూచీగా వ్యవహరించింది అన్న చర్చ కూడా జనంలో జోరుగా సాగుతోంది. దీంతో దిక్కు తోచని స్థితిలో వైసీపీ నాయకులు అయినదానికీ కాని దానికీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలలో మరింత చులకన అవుతున్నారు. తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు. 

ఇంతకీ శ్రీచరణి వరల్డ్ కప్ విజయం తరువాత శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గురువారం  (నవంబర్ 6) ఆమె హస్తినలో ప్రధాని మోడీ నివాసంలో జట్టు సభ్యులతో పాటు ఉన్నారు. అంటే శ్రీచరణి  రాకముందే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ గగ్గోలు పెట్టేయడం మొదలు పెట్టేసింది. సొంత మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేసింది. ఇక్కడ వైసీపీ దుగ్ధ అంతా ఎలాగూ ప్రభుత్వం శ్రీచరణికి భారీగా నజరానాలు ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వం అలా ప్రకటించడానికి తామే కారణమన్న క్రెడిట్ కొట్టేయడానికే వైసీపీ ఇలా వ్యవహరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

సరే జరిగిందేమిటంటే.. శ్రీ చరణి శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి వచ్చారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి నేరుగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఆమెను అభినందించారు.  ఆ వెంటనే రెండున్న కోట్ల నగదు బహుమతి, గ్రూప్1 స్థాయి ప్రభుత్వోద్యోగం, ఆమె స్వస్థలం కడపలో వెయ్యి గజాల నివాసస్థలం ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కడపలో ఆమెను ఘనంగా సత్కరించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగేవే. క్రీడల పట్ల, క్రీడాకారులను ప్రోత్సహించడం పట్ల చంద్రబాబు ఎంత ప్రోయాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రభుత్వం శ్రీచరణికి నజరానాలు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిన వైసీపీ ముందుగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించేసి.. ఇప్పుడు తాము గట్టిగా మాట్లాడడం వల్లనే చంద్రబాబు సర్కార్ శ్రీచరణికి నజరానాలు ఇచ్చిందని చెప్పుకుని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసిందని అంటున్నారు.

అయితే క్రెడిట్ చోరీకి వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ హయాంలో  రాష్ట్రంలో  క్రీడలను ఇసుమంతైనా ప్రోత్సహించలేదు. క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యా లూ కల్పించలేదు సరికదా.. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారు.  అంతే కాదు చంద్రబాబు చేపట్టిన గాండీవం ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీకి బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా, శిక్షణను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది.  ఇప్పుడు శ్రీచరణి విషయంలో వైసీపీ చంద్రబాబు సర్కార్ పై చేస్తున్న విమర్శల నేపథ్యంలో జనం నాడు జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రస్తావిస్తూ నవ్వుకుంటున్నారు.  

By
en-us Political News

  
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.