ఆర్టీసీపై అంతా అబద్ధం.. బయటపడిన విజయసాయి బండారం
Publish Date:Feb 23, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మాయల మరాఠీ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తిమ్మిని బమ్మి చేయడంలో ఆయన నెంబర్ టూ. ట్విట్వర్ లో నిత్యం ఏదో ఒక కామెంట్లు పెట్టడం ఆయన స్టైల్. సీఎం జగన్ భజన చేయడంతో పాటు రాజకీయ విమర్శలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలోనూ ముందుంటారు. లేటెస్ట్ గా ఏపీఎస్ఆర్టీసీ విషయంలో విజయసాయి చేసిన ట్వీట్ ఆయనకే బూమరాంగ్ గా మారింది. జగన్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ లాభాల బాట పట్టిదంటూ సొంత డబ్బా కొట్టి.. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ స్టేట్ మెంట్ తో అడ్డంగా బుక్కై పరువు పోగొట్టుకున్నారు. ఇటు విజయసాయి ట్వీట్.. అటు ఆర్పీ ఠాకూర్ క్లారిటీ.. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం గారి దూరదృష్టి వల్ల ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకొచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్టీసీని తన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. జగన్ గారు ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఒక్క ప్రభుత్వ సంస్థనైనా ఇలా నిలబెట్టావా చంద్రబాబూ? అంటూ ఫిబ్రవరి 15న విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కట్ చేస్తే.. లేటెస్ట్ గా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఏపీఎస్ఆర్టీసీ 6వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు ఆర్పీ ఠాకూర్. కార్గో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. డీజిల్ ధరలు పెరిగి అదనపు భారం పడుతోందన్నారు. ఖర్చులు తగ్గించాలని.. కష్టపడి పనిచేయాలని సిబ్బందికి సూచించారు. వర్కర్స్‌కు రావాల్సిన బకాయిలన్ని విడుదల చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీ వ్యవహారాలు చూసే ఎండీ.. సంస్థ 6వేల కోట్ల నష్టాల్లో ఉందంటే.. ఎంపీ విజయసాయి మాత్రం జగన్ చొరవతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిదంటూ ప్రజలను తప్పుదారి పట్టించడంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి కాపాడాల్సింది పోయి.. ఇలా అబద్దాలు ప్రచారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-mp-vijay-sai-reddy-wrong-statement-apsrtc-25-110567.html





