ఏపీ నుంచి పారిపోయేలా జగన్ పాలన!

Publish Date:Jun 20, 2023

Advertisement

విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  సరే ఆ కిడ్నాప్ సుఖాంతమైందనుకోండి. అదలా ఉంచితే ఈ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో అందునా జగన్ కలల రాజధాని అయిన విశాఖ పట్నంలో శాంతి భద్రతలు ఎంత సుందరముదనష్టంగా వెలిగిపోతున్నాయో తేటతెల్లం చేసింది. అంతే కాదు ఏపీ వ్యాప్తంగా గత రెండు వారాలుగా జరిగిన వరుస హింసాత్మక సంఘటనలు ( దళితుడి హత్య, బాలుడి దహనం, దళిత మహిళపై అత్యాచారం వంటివి) రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టాయి.

ఈ నేపథ్యంలోనే సాక్షాత్తే అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట్రంలో వ్యాపారాలు చేయలేనని ప్రకటించి తన వ్యాపారాలన్నిటినీ హైదరాబాద్ కు మార్చేస్తున్నానని ప్రకటించారు. ఆయన తన వ్యాపారాలను విశాఖపట్నం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటన  అటు  మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఏపీలో వ్యాపారం చేయలేని పరిస్థితులున్నాయని సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీయే రాష్ట్రం నుంచి బిచాణా ఎత్తేయడానికి సిద్ధపడటంతో  జనం, నెటిజనం సైతం అడెడ్డె అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

రాష్ట్రంలో సొంత పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకే కాదు.. వారి కుటుంబాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని అందుకే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారని జనం అంటున్నారు. మరోవైపు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం మామూలు వ్యవహారం కాదని.. ఈ కిడ్నాప్ స్కెచ్‌లో పెద్ద తలకాయలే ఉన్నాయనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఈ వాస్తవం ఉందనడానికి  ఎంపీ తన వ్యాపారాలను పక్క రాష్ట్రానికి తరలించేయాలని నిర్ణయం తీసుకోవడమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ చేసిన ఆరోపణను గుర్తు చేస్తున్నారు. అలాగే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  సొంత పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.

అయినా ప్రతిపక్షాలు అంటే అడిపోసుకోంటాయంటారు కానీ, జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మొన్న చిత్తూరు జిల్లా నుంచి అమర్‌రాజా బ్యాటరీస్  తెలంగాణ రాజదాని హైదరాబాద్ వెళ్లిపోయింది.  నిన్న విశాఖ జిల్లా నుంచి లూలూ గ్రూప్ సంస్థ.. తమిళనాడులోని కోయంబత్తురుకు తరలి పోయింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోవడానికి, వ్యాపారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి జగన్ ప్రభుత్వ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం నుంచి తరలిపోతున్న సంస్థల  జాబితాలో ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన వ్యాపార సంస్థలు   చేరిపోయాయని పేర్కొంటున్నారు.  

అయితే తెలంగాణలోని  హైదరాబాద్‌కు వెళ్లిపోయిన అమరరాజా బ్యాటరీస్ అంటే తెలుగుదేశం నాయకుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించింది.  విశాఖపట్నం వేదికగా వ్యాపారం చేసుకోనేందుకు లూలూ గ్రూప్... గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకొంది. అయితే జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను  రద్దు చేయడంతో.. లూలూ గ్రూప్ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని.. తన వ్యాపారాన్ని ఆ రాష్ట్రంలో విస్తరించుకొనే పనిలో నిమగ్నమై పోయింది.  

మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోక్‌సభ సభ్యుడు ఈ విధంగా తన వ్యాపారాలను హైదరాబాద్‌కు తరలించేస్తున్నాన్నంటూ స్వయంగా ప్రకటించడం చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఈ జగన్ ప్రభుత్వం ఎటువంటి సందేశం ఇస్తున్నట్లు అని నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే భావన ప్రజల్లో సైతం వ్యక్తమవుతోందని  స్పష్టం చేస్తున్నారు.  

విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన భార్య జ్యోతి, వారి కుమారుడు శరత్,  ఎంపీ స్నేహితుడు కమ్ ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులు ఇటీవల  కిడ్నాప్ కు గురయ్యారు. ఆ క్రమంలో వారిపై కిడ్నాపర్లు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అయితే ఈ కిడ్నాప్‌పై పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేసే సమయానికి ఈ దాడి జరిగిపోవడం గమనార్హం. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. కానీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. 

ఇలా పలు వ్యాపార సంస్థలు.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతే.. ఉపాధి లేక..యవత పెడ మార్గం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును చేజేతులా కాలరాసుకొంటుందని చెబుతున్నారు. ఇటువంటి పరిణామాలకు... ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? ఓటు వేసి గెలిపించిన ఓటర్లా? ఓట్ల దండుకొనే క్రమంలో నోట్లు విసిరిన జిత్తుల మారి నాయకులా? అనేది మనస్సు పెట్టి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సూచిస్తున్నారు. లేకుంటే యవత భవితకే కాదు.. నవ్యంధ్రాకు సైతం కారు చీకట్లు కమ్ముకోవడం ఖాయమని ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆవేదనతో స్పష్టం చేస్తున్నారు.

By
en-us Political News

  
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.