వైసీపీ నిండా బిల్డప్ బాబాయ్ లే.. తాజాగా ఫొటో షూట్ తో హల్ చల్ చేసిన గుడివాడ అమర్నాథ్

Publish Date:Aug 24, 2022

Advertisement

వైసీపీ నాయకులు మంత్రుల వ్యవహార శైలి ఏదో టీవీ షోలో బిల్డప్ బాబాయ్ చేసే పెచ్చులను మించి పోతోందని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రోజా తిరుమల స్వామి వారి దేవాలయంలో అనుచరులతో చేసిన హల్ చల్ మరువక ముందే రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫోటో షూట్ పేరిట చేసిన హంగామా ఇప్పుడు సమాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురౌతోంది. ఇటీవల ఆయన ఫొటో షూట్ పేరిట చేసిన హడావుడి నవ్వుల పాలు కావడమే కాకుండా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదో ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తెరకెక్కుతోందా అన్నట్లుగా ఆ హంగామా సాగింది. ఇంతకీ ఆ హడావుడి అంతా మంత్రిగారు వివిధ పోజుల్లో ఫొటోలు దిగేందుకేనని ఆ తరువాత తేలింది. ఈ సందర్భంగా ఆయన పొటోలకు ఇచ్చిన పోజులు నేల విడిచి సాము చేసిన చందంగా ఉన్నాయని సెటైర్లు పేలుతున్నాయి.   మంత్రి గుడివాడ గుర్నాథ్ కు బిల్డప్ బాబాయ్ అన్న ట్యాగ్ కూడా తగిలించేశారు నెటిజన్లు. మరో వైపు మంత్రిగారు పోజులు పెడుతూ దిగిన పొటోలు విపక్షాలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి షేర్లు చేస్తున్నారు.
 
గుడివాడ అమర్‌నాథ్ మంత్రిగా రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు కానీ.. పెట్టుబడులు కానీ తీసుకు వచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే కానీ,   జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించేందుకు మాత్రం అపరాత్రి, అర్దరాత్రి అన్న తేడాలేకుండా ఎవర్ రెడీగా ఉంటారని మాత్రం పరిశీలకులు అంటుంటారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో  గుడివాడ అమర్నాథ్ కు పేరుకు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు కానీ ఆయనకు అప్పగించిన పని మాత్రం జనసేనానిపై విమర్శలు గుప్పించడానికేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకు పేరుకు జల వనరుల శాఖ ఇచ్చినా.. ఆయనకు అప్పగించిన పని మాత్రం తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనని అంటున్నారు. జగన్ తొలి కేబినెట్ లో ఇలా తిట్ల శాఖల మంత్రులుగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు ఉండేవారనీ, ఇప్పుడు వారి స్థానాలను గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులు బర్తీ చేశారని అంటున్నారు.  

 
అలాగే నాటి మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు.. ఫోన్ కాల్ వ్యవహారం సైతం సోషల్ మీడియాలో గంట... అరగంట.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టి రచ్చ రచ్చ చేసి పారేశారు. ఇక థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ, నటుడు పృద్దీరాజ్ సైతం ఎస్వీబీసీ చానల్ చైర్మన్‌గా బాద్యతలు చేపట్టి.. పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే.. మహిళతో అసభ్యంగా పోన్ కాల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి... ఉద్వాసనకు గురయ్యారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధుల తీరుతెన్నులపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ఎండగడుతున్నా.. వారు మాత్రం... తమ స్టైల్‌ ఇదే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ సంగతి అందరికి తెలిసిందే. దీంతో యాధా అధినేత.. తధా నాయకుడు అన్నట్లుగా ఉందని నెటిజన్లు(సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.)

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.