కుప్పంలో వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్!

Publish Date:Aug 1, 2024

Advertisement

వైనాట్ కుప్పం.. వైనాట్ 175.. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌  స్లోగ‌న్ ఇదే. కుప్పంలోనూ వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌బోతున్నారంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ వైసీపీ నేత‌లు ఢంకా  బజాయించారు. చంద్ర‌బాబు ఓడిపోతున్నారు.. కుప్పంలో తెలుగుదేశం దుకాణం బంద్ కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌దేప‌దే చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలతో  సీన్ రివ‌ర్స్ అయింది. తాము ఒక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి తలచింద‌న్న‌ట్లుగా.. వైసీపీ నేత‌లు ఒక‌టి త‌లిస్తే.. కుప్పం ప్ర‌జ‌లు మ‌రొక‌టి త‌లిచారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో వ‌స్తే .. కుప్పంలో చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ మెజార్టీతో విజ‌యం సాధించాడు. ఒక‌ విధంగా చెప్పాలంటే కుప్పం నియోజ‌ క‌వ‌ర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న అనుచ‌రులు చేసిన అరాచ‌కాల‌కు కుప్పం ప్ర‌జ‌లు విసిగిపోయి చంద్రబాబును అత్య‌ధిక మెజార్టీతో గెలిపించారు.  

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై  సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఆయ‌న సతీమ‌ణి భువ‌నేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌తంలో వైసీపీ నేత‌ల ఒత్తిడితో తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడిన నేత‌లంతా ఇప్పుడు త‌మ త‌ప్పును తెలుసుకొని ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  తాజాగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో కుప్పం  వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబుతోనే నియోజ‌క‌వర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. గ‌తంలో వైసీపీ నేత‌ల ట్రాప్‌లోప‌డి తాము కంట్రోల్ త‌ప్పామ‌ని, కానీ, రాష్ట్రంతో పాటు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో మిగిలిన వైసీపీ నేత‌లు సైతం త్వ‌ర‌లో తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే క‌ుప్పం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ కార్యాల‌యాన్ని మూసేసి హోట‌ల్ గా మార్చేశారు. మ‌రోవైపు చంద్ర‌బాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భ‌ర‌త్ అధికారం కోల్పోయిన నాటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు. కుప్పంలో చంద్ర‌బాబును కాద‌ని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌కు స్ప‌ష్ట‌త రావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే కుప్పంలో వైసీపీ పూర్తిగా ఖాళీఅయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో వుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడేవాళ్లు నియోజకవర్గంలో ఎక్కువ.  కమ్మ , రెడ్డి, శెట్టిబలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు ఏడు ద‌ఫాలుగా వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ కుప్పంలో చంద్ర‌బాబును ఢీకొట్టేందుకు సాహ‌సం చేయ‌లేదు.  కానీ, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుప్పంపై దృష్టి పెట్టారు. చంద్ర‌బాబును 2024 ఎన్నిక‌ల్లో ఓడించే బాధ్య‌త‌ను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించాడు.

దీంతో పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర‌ లేపారు. ప‌లుసార్లు  చంద్ర‌బాబును సైతం నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌కుండా పెద్దిరెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైసీపీ గూండాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. చంద్ర‌బాబుపై రాళ్ల‌దాడికి సైతం దిగారు. పోలీసులు సైతం పెద్దిరెడ్డి చెప్పిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ చంద్ర‌బాబుపై, తెలుగుదేశం నేత‌ల‌పైనే కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌తో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. తెలుగుదేశం పార్టీకి ప‌లువురు ముఖ్య‌ నేత‌ల‌ను బెదిరింపుల‌కు గురిచేసి వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో కుప్పంలో చంద్ర‌బాబు ఓడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌హా వైసీపీ నేత‌లు విస్తృత ప్ర‌చారం చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో కుప్పం ప్ర‌జ‌లు మేమంతా చంద్ర‌బాబువైపే అంటూ ఓటు ద్వారా స్ప‌ష్టం చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో భ‌యంతో వైసీపీ గూటికి చేరిన తెలుగుదేశం నేత‌ల‌తో పాటు..  వైసీపీలో మొద‌టి నుంచి కొన‌సాగుతున్న అంద‌రూ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. మ‌రి కొద్ది రోజుల్లో మిగిలిన వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుపై అవాకులు చ‌వాకులు పేలిన ఎమ్మెల్సీ భ‌ర‌త్ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కార్యాల‌యం మూత‌ప‌డ‌గా.. రాబోయే రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండ‌ద‌ని తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి కుప్పంలో చంద్ర‌బాబును ఓడించాల‌ని ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌తో రెచ్చిపోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌స్తుత ప‌రిణామాలు బిగ్‌షాక్ అనే చెప్పొచ్చు. రాబోయే కాలంలో వైఎస్ జ‌గ‌న్ కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి రావాలంటే వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఉండ‌ని ప‌రిస్థితి కుప్పంలో ఏర్ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.