జీవీఎల్ మళ్లీ మొదలెట్టేశారు!

Publish Date:Aug 1, 2024

Advertisement

జీవీఎల్ నరసింహారావు తన జగన్ భక్తిని చాటుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. పేరుకు బీజేపీ ఎంపీ అయినా జగన్ ఏపీలో అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా జీవీఎల్  వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గానే వ్యవహరించారు. ఆయన తీరుకు అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకులే అసహనం వ్యక్తం చేశారు. జీవీఎల్ తీరు పై రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్ఠానానికి  ఫిర్యాదులు కూడా చేశారు.  అంతెందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జీవీఎల్ తీరుపై విమర్శలు గుప్పించారు.  జగన్ అండతో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా ఎంపీగా ఎన్నికైపోవచ్చని భావించి.. జగన్ పైనా, జగన్ పార్టీపైనా జీవీఎల్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. 

సరే ఆయనకు బీజేపీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. చేసింది చాలు.. ఇక మౌనంగా ఉండండి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో జీవీఎల్ కు తత్వం బోధపడి ఇక నోరెత్తే సాహసం చేయరని అంతా అనుకున్నారు. అయితే ఓ నెలా పదిహేను రోజులు నోరు కట్టేసుకుని మౌనంగా ఉన్న ఆయన మళ్లీ జగన్ కు మద్దతుగా తన డ్యూటీని ప్రారంభించేశారు. 

అమరావతిపై విషం చిమ్మడం మొదలెట్టేశారు. అమరావతికి కేంద్రం ఇచ్చింది ముమ్మాటికీ అప్పేనని, ఎవరూ అడగకుండానే జగన్ గొంతు అరువు తీసుకుని మరీ రోడ్డెక్కేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయలూ అప్పేనని చెప్పారు. అయితే  ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదుని.. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. 

బీజేపీ నేతగా జీవీఎల్ అన్న ఈ మాటల్ని పట్టుకుని  వైసీపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంటూ గగ్గోలు పెట్టేయడం మొదలైంది.  వాస్తవానికి కేంద్రం గ్యారంటీగా ఉండి ఇప్పించే అప్పులు కేంద్రం ఖాతాలోనే ఉంటాయి. రాష్ట్రం ఓ పది శాతం కట్టాల్సి ఉంటుంది. ఆ పది శాతం కూడా రాష్ట్రం కట్టలేకపోతే.. అదీ కేంద్రమే కడుతుంది.  అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. అభివృద్ధి పనులు జరిగితే ఆటోమేటిక్‌గా పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది.  ఇది అందరికీ తెలిసిందే.  అయినా జీవీఎల్ ఎందుకు పనిగట్టుకుని కేంద్రం అమరావతికి ఇచ్చింది అప్పు అంటూ వైసీపీ వాదనకు మద్దతు పలకడానికి మీడియా ముందుకు వచ్చి జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడానికి తహతహలాడుతున్నారు.  నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని చెబుతూనే.. బడ్జెట్ లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే అర్ధం వచ్చే మాటలు మాట్లాడుతూ.. జగన్ భక్తిని చాటుకున్నారు.  జీవీఎల్ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు అన్న విషయంలో బీజేపీకి స్పష్టత ఉంది.  కాషాయ కండువా కప్పుకుని ఫ్యాన్ గాలి పీలుస్తానంటున్న జీవీఎల్ కు  శృంగభంగం తప్పదని బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.