జగన్ అడ్డగోలు విమర్శలు.. విస్తుపోతున్న వైసీపీ శ్రేణులు!

Publish Date:Jul 28, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ సీఎం జగన్ తెలుగుదేశం కూటమి సర్కార్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా సీఎం చంద్రబాబు జగన్ ప్రస్తావించిన అంశాలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటన్నిటినీ  అసెంబ్లీ వేదికగా వివరించారు. జగన్ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి బయట ఆరోపణలు చేయడం పిరికిపంద లక్షణమనీ, అసెంబ్లీకి హాజరై.. ఆ ఆరోపణలు చేసి ఉంటే నిజాలు నిగ్గు తేల్చేవాళ్లమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ధైర్యం లేకే, నిజాలను విని తట్టుకునే దమ్ము లేకపోవడం వల్లే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. 

జగన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తరువాతనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్దికి బాటలు పరుచుకున్నాయి, జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని చూసిన జనం.. చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి కోసం వేస్తున్న అడుగులను స్వాగతిస్తున్నారు. జగన్ శాంతి భద్రతల పరిస్థితిపై చేస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. 52రోజుల కూటమి పాలన దాడులు,అత్యాచారాలు,హింసాకాండ నడుస్తోందంటూ జగన్ హస్తిన వెళ్లి ధర్నా చేయడాన్ని చూసి నవ్వుకుంటున్నారు.   మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారం టూ జగన్ చేస్తున్న ఆరోపణలను ప్రజలే తిప్పి కొడుతున్నారు.  మదనపల్లి సబ్ కలక్టరేట్ లో   కీలక ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్నది ఎవరని నిలదీస్తున్నారు.  రషీద్ హత్యపై జగన్ చేస్తున్న ఆరోపణలను సొంత పార్టీ వారే నమ్మడం లేదు.  హంతకుడూ, హతుడూ కూడా నిన్నమొన్నటి వరకూ వైసీపీలోనే ఉన్న సంగతిని వైసీపీ వర్గాలే గుర్తు చేసుకుంటున్నారు.  

చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తే, అసెంబ్లీలో వాటిపై మాట్లాడాల్సింది పోయి, సభకు డుమ్మా కొట్టి బయట నుంచి విమర్శలేమిటని నిలదీస్తున్నారు.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 36హత్యలు  జరిగాయంటూ విమర్శలు చేస్తున్న జగన్.. హతుల పేర్లు ఎందుకు చెప్పడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 36 మంది హత్యకు గురైతే ఒక్క రషీద్ కుటుంబాన్నే పరామర్శించడానికి కారణమేమిటన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.  మొత్తం మీద జగన్ తీరు పట్ల వైసీపీలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడతారన్న విస్మయం వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.