దాడులు వైసీపీవి.. కేసులు తెలుగుదేశం కార్యకర్తలపై

Publish Date:Sep 6, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా భీమవరం నియోజకవర్గం తాడేరు వద్ద లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఈ రాళ్ల దాడి జరిగింది. లోకేశ్ పాదయాత్ర కాన్వాయ్ పై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. యువగళం కాన్వాయ్ లోని పలు వాహనాలను ధ్వంసం అయ్యాయి. దీంతో పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్న భవనాల పైకి ఎక్కి రాళ్ల దాడికి పాల్పడడంతో పాటు వైసీపీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఎంత కవ్వింపు చర్యలకు దిగినా సహనం కోల్పోకుండా నిలిచిన తెలుగుదేశం కార్యకర్తలు  రాళ్లదాడితో తిరగబడ్డారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ కార్యకర్తలకు రక్షణగా నిలిచారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మొదటి నుంచి వైసీపీ ఆటంకాలు కలిగిస్తూనే ఉంది. యువగళంపై దాడులు చేస్తున్నది. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పి ఘర్షణలు సృష్టిస్తున్నది. లోకేష్ ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తూ రకరకాల కేసులు పెడుతున్నారు. ఏకంగా పోలీసుల అండతోనే  వైసీపీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పుంగనూరు, ఎమ్మిగనూరు, పెదపారుపూడి.. ఇలా అనేక ప్రదేశాల్లో వైసీపీ  లోకేష్  పాదయాత్రలో ఘర్షణలు సృష్టించింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  అయితే ఈ అన్ని సందర్భాలలోనూ పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా భీమవరం నియోజకవర్గం తాడేరు పాదయాత్రలో కూడా అదే  జరిగింది.

తాడేరులో పాదయాత్ర కొనసాగుతుండగా.. వైసీపీ కార్యకర్తలు చుట్టుపక్కల భవనాల పైనుంచి వైసీపీ జండాలు ఊపుతూ టీడీపీ శ్రేణులను కవ్వించారు. అదే భవనాలపై నుంచి ముందుగానే సిద్ధం చేసుకున్న రాళ్ళు, సోడా సీసాలూ విసురుతూ దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో పాదయాత్ర జరుగుతున్న రోడ్డు పక్కనే కర్రలతో సిద్దంగా ఉన్న మరికొందరు వైసీపీ కార్యకర్తలు యువగళం వాలంటీర్లను చుట్టుముట్టి చితకబాదారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో సహా పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు వైపుల నుంచి ఒకేసారి దాడులు జరుగడంతో ఊహించని ఈ పరిణామానికి నారా లోకేష్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొనే ప్రయత్నం చేయకపోగా వారు కూడా యువగళం వాలంటీర్లపైనే తమ ప్రతాపం చూపడంతో కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. 

ఈ దాడుల అంశంలో మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో యువగళం క్యాంప్ సైట్ పై పోలీసులు దాడి చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ పాదయాత్రతో అలసిపోయి నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు వాహనాల్లో యువగళం వాలంటీర్లను తరలించారు. ఈ వాలంటీర్లను రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ చితకబాదారు. అనంతరం బుధవారం ఉదయం సిసిలీలోని వైసీపీ నేతకు చెందిన రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్ పోర్ట్స్ ఫ్యాక్టరీలో బంధించారు. విషయం బయటకి పొక్కడంతో అందరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది.

పోలీసుల అదుపులో ఉన్న యువగళం వాలంటీర్లపై 307 సెక్షన్ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ కార్యకర్తలను భీమవరం, నర్సాపురం, వీరవాసరం పోలీస్ స్టేషన్లకు తిప్పారని, చివరికి వైసీపీ నేత ఫ్యాక్టరీలో బంధించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాళ్ల దాడిలో దెబ్బలు తిన్న తమనే అరెస్టు చేయడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించాకే యాత్ర చేపట్టమని, వైసీపీ కార్యకర్తలతో కవ్వింపు చర్యలు చేపట్టి, ఇప్పుడు వాలంటీర్లను అరెస్టులు చేశారని మండిపడుతున్నారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని తెలుస్తుండగా.. వైసీపీ వర్గాలు ఇలాంటి ఏర్పాట్లు చేసుకొంటున్నారని ముందే తెలిసినప్పటికీ పోలీసులు వారిని నిలువరించలేదు. పైగా ఘర్షణలలో వారికే అండగా నిలబడి.. చివరికి తిరిగి టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లపైనే కేసులు పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో ఎలాంటి అరాచక పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.