శాశ్వత అధికారం దిశగా మోడీ అడుగులు.. విపక్షాల ఆందోళన!

Publish Date:Sep 6, 2023

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ నియంతృత్వ పోకడలు దేశానికి చేటుగా పరిణమిస్తున్నాయని విపక్షాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నాయి. అంతేనా మోడీ నేతృత్వంలో  కేంద్ర సర్కార్ రాష్ట్రాల ఆదాయాన్నీ, హక్కులను హరించేస్తున్నదన్న ఆందోళన బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే మోడీ మరో సారి ప్రధాని అయితే.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నాయి.

అసలింతకీ మోడీ మరో సారి అధికారంలోకి వస్తారా? రారా అన్నది పక్కన పెడితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరిట ఆయన రాజ్యాంగాన్ని మర్చే ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇటీవలే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు మణిపూర్ హింసాకాండపై సుదీర్ఘ ప్రతిష్ఠంభణతో వాయిదాల పర్వం నడిచింది. ఈ సమావేశాలలోనే విపక్షాలు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి కూడా. ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఆ సమావేశాలు ముగిసిన వెంటనే  మళ్లీ ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణ ఎందుకు? అజెండా ఏమిటి? అన్న విపక్షాల ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పడం లేదు. కానీ ఇస్తున్న లీకులు.. మంత్రులు, బీజేపీ నేతల మాటలను బట్టి రెండు కీలక అంశాలను ఈ ప్రత్యేక సమావేశాలలో చేపట్టి సభ ఆమోదం పొంది చట్టం చేయాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కార్ ఉన్నట్లు అవగతమౌతున్నదని పరీశీలకులు వివరిస్తున్నారు.

వాటిలో ఒకటి జమిలి ఎన్నికలు కాగా మరొకటి దేశం పేరు మార్పు. ఈ రెండు అంశాలలో బీజేపీ సక్సెస్ అయితే  మోడీ హ్యాట్రిక్ సాధించే వరకూ ఆగనవసరం లేకుండానే నియంత అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయినా మోడీలోని నియంతృత్వ పోకడలు ఆయన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కీలక అంశాల విషయంలో ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాని మౌనం వహించడం.. ఎన్నికల ప్రచారాలలో ఉద్వేగభరిత  ప్రసంగాలు, విపక్షాలపై విమర్శల దాడులతో విరుచుకుపడటం తప్ప మోడీ కనీసం తన ప్రభుత్వ విధానాలను వివరించేందుకు మీడియా సమావేశాలు సైతం ఏర్పాటు చేయరని పరిశీలకులు అంటున్నారు. భారత్ గా దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాల నిర్వహణ ద్వారా మరో  మారు తాను అధికారంలోకి రావడానికి రాచబాట పరుచుకుని.. ఆ తరువాత చైనా అధ్యక్షుడి బాటలో జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.  

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో  ఉండేలా, రాజ్యంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెడుతుందని ఇప్పటికే ఆప్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, మోడీ కుట్రలను ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యత అనివార్యమని పదే పదే చెబుతోంది.  నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్ని, ఒక్క ఆప్ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పుడో గుర్తించాయి. అందుకే దేశాన్ని ఈ విపత్తు నుంచి కాపాడేందుకు, విపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేయాలని, లేదంటే, 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం అయ్యే పనికాదన్న భావన దాదాపు అన్ని బీజేపీయేతర పార్టీలలోనూ వ్యక్తమౌతున్నది.   

By
en-us Political News

  
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.