పోలింగ్ కేంద్రాల వ‌ద్ద వైసీపీ శ్రేణుల‌ అరాచ‌కం.. దీటుగా స‌మాధాన‌మిచ్చిన ఓట‌ర్లు

Publish Date:May 13, 2024

Advertisement

వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు. రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు మ‌హిళ‌లు, యువ‌తులు సైతం క్యూలైన్ల‌లో నిల‌బ‌డి ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. అరాచ‌క ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు కంక‌ణం క‌ట్టుకొని మ‌రీ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉండ‌టంతో ఓట‌మి ఖాయ‌మ‌ని ముందే ఊహించిన వైసీపీ గ్యాంగ్‌ పోలింగ్‌ ఎక్కువ‌ శాతం న‌మోదు కాకుండా అడ్డుకునేందుకు అనేక‌ ప్ర‌య‌త్నాలు చేసింది. పోలింగ్ ప్రారంభం నుంచి గొడ‌వలు సృష్టించ‌డం మొద‌లు పెట్టారు. టీడీపీ నేత‌ల వాహ‌నాల‌పై దాడులు, పోలింగ్ బూత్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన టీడీపీ నేత‌ల‌ను అడ్డుకోవ‌టం, కూట‌మి త‌ర‌పున పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్ల‌ను కిడ్నాప్ లు, దాడులు చేయ‌డం ద్వారా భ‌యాన‌క వాతావ‌ర‌ణంను సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఓట‌ర్లు వైసీపీ కుట్ర‌ల‌ను తిప్పికొట్టి పోలింగ్ కేంద్రాల వ‌ద్ద గంట‌ల‌ కొద్దీ కూలైన్ల‌లో నిల్చొని మ‌రీ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రాత్రి 11 గంట‌ల‌కు వ‌ర‌కు ప‌లు పోలింగ్ కేంద్రాల్లో కూలైన్లు క‌నిపించాయి. పోలింగ్ ప్రారంభ‌మైన స‌మ‌యం నుంచి రాత్రి వ‌ర‌కు వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌ను అడ్డుకోవ‌టంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యారు. ఉద‌యం నుంచి వైసీపీ నేత‌లు ఘ‌ర్ష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న‌ప్ప‌టికీ పోలీసులు అల‌ర్ట్ కాక‌పోగా ప‌లు ప్రాంతాల్లో వైసీపీ నేత‌ల‌కు కొంద‌రు పోలీసులు మ‌ద్ద‌తుగా నిలిచారు. 

వైసీపీ పార్టీని ఓట‌మి భ‌యం ఎంత‌లా వెంటాడిందంటే తెనాలి ఘ‌ట‌న ప్రధాన ఉదాహ‌ర‌ణ‌. క్యూలైన్ లో వ‌చ్చి ఓటు వేయాల‌ని ప్ర‌శ్నించినందుకు తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి అన్నబత్తుని శివ కుమార్ ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. స‌హ‌నం కోల్పోయి ఓట‌రు పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు శివకుమార్ పై తిర‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓట‌మి భ‌యంతో స‌హ‌నం కోల్పోయి వైసీపీ నేత‌లు ఓట‌ర్ల‌పై దాడులు చేయ‌డం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు సాగాయి. క‌డ‌ప జిల్లాలోనూ వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. క‌డ‌ప న‌గ‌రంలోని గౌస్ న‌గ‌ర్ లో దొంగ ఓట్లు వేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ వైసీపీ నేత‌ల‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నం చేయ‌గా ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌ దాడికి దిగి ఓట్ల‌ర్ల‌ను, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు. ఒంగోలులో టీడీపీ ఏజెంట్ల‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు య‌త్నించ‌గా టీడీపీ నేత‌లు అడ్డుకున్నారు.. దీంతో మాజీ మంత్రి బాలినేని కోడ‌లు శ్రీ‌కావ్య ఆధ్వ‌ర్యంలో టీడీపీ ఏజెంట్ల‌పై వైసీపీ అల్ల‌రిమూక‌లు దాడుల‌కు దిగారు. అదే విధంగా మ‌న్యం జిల్లా వీర‌ఘ‌ట్టం మండ‌లం తెట్టంగి గ్రామంలో ఎస్సీల‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇళ్ల‌లోకి చొర‌బ‌డి క‌ర్ర‌లు, రాళ్ల‌తో వైసీపీ శ్రేణులు దాడుల‌కు దిగారు. ప్ర‌కాశం జిల్లాలో వీర‌భ‌ద్ర‌పురంలో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పోలింగ్ బూత్ వ‌ద్ద బెదిరింపుల‌కు దిగాడు. పోలింగ్ అధికారుల‌పైనా బెదిరింపుల‌కు పాల్ప‌డి పోలింగ్ త‌మ‌కు అనుకూలంగా జ‌రిగేలా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.

 పల్నాడు జిల్లాలో వైసీపీ గూండాలు బీభ‌త్సం సృష్టించారు. తంగెడ‌లో నాటు బాంబులు, పెట్రోల్ సీసాల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో భ‌యాందోళ‌న‌తో పోలింగ్ కేంద్రం నుంచి ఓట‌ర్లు ప‌రుగులు తీశారు. నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని ట్రైనీ కలెక్టర్ చెప్పారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన వైసీపీ మూక‌లు శ్రీకృష్ణ దేవరాయలు కాన్వాయ్ పై రాళ్ల‌దాడి చేశాయి. అదే విధంగా అంబ‌టి రాంబాబు అనుచ‌రులు వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్ ల వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించి ఓట‌ర్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. న‌ర్స‌రావుపేట ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద వైసీపీ శ్రేణులు హ‌ల్ చ‌ల్ చేశాయి. చ‌ద‌ల‌వాడ కారుపై దాడికి దిగాయి. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ శ్రేణులు పేట్రేగిపోయాయి. దొంగ ఓట్లు వేసేవారిని టీడీపీ నేత‌లు అడ్డుకోవ‌టంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడికి దిగారు. మంత్రి జోగి ర‌మేష్‌, ఆయ‌న కుమారుడు రాజీవ్ ఓట‌మి భ‌యంతో పోరంకి ఎన్నిక‌ల బూత్‌ల వ‌ద్ద వారి అనుచ‌రుల‌తో అల‌జ‌డి సృష్టించి పోలింగ్ ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఓట‌ర్లు మాత్రం ఘ‌ర్ష‌ణ‌ల‌కు భ‌య‌ప‌డ‌కుండా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో 120కిపైగా ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణుల‌పై దాడులు జ‌రిగాయ‌ని, వైసీపీ మూక‌లు పోలింగ్ ను అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశార‌ని ఈసీకి లేఖ రాశారు. ప‌లు ప్రాంతాల్లో పోలీసుల తీరును చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. కొంద‌రు పోలీసులు కావాల‌ని వైసీపీకి మ‌ద్ద‌తు ప‌నిచేశార‌ని ఈసీకి రాసిన లేఖ‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌డం ప‌ట్ల చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

అనంత‌పురం జిల్లాలోనూ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. తాడిప‌త్రిలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ప‌రిస్థితి త‌లెత్తింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొంద‌రు పోలీసుల అండ‌తో తెలుగుదేశం నేత‌ల‌పై దాడుల‌కు య‌త్నించారు. తెలుగుదేశం శ్రేణులు ఎదురుతిర‌గ‌డంతో పోలీసులు రంగంలోకిదిగి ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా అడ్డుకున్నారు. అయినా ప‌లు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం నేత‌ల‌పై దాడుల‌కు దిగారు. శ్రీ‌కాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లపై వైసీపీ నేత‌లు దాడికి దిగారు. ప‌లువురు  కార్య‌క‌ర్త‌లకు గాయాల‌య్యాయి. అన్న‌మ‌య్య జిల్లా ల‌క్కిరెడ్డిప‌ల్లి మండ‌లం చౌట‌ప‌ల్లెలో తెలుగుదేశం ఏజెంట్ల‌పై వైసీపీ మూక‌లు రాళ్ల‌దాడికి దిగాయి. అదేవిధంగా మాచ‌ర్ల‌లోని పోలింగ్ ఏజెంట్ల‌పైనా వైసీపీ గూండాలు దాడుల‌కు పాల్ప‌డ్డారు. క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం ఏజెంట్ పైనా వైసీపీ గూండాలు దాడి చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దాడుల‌తో పోలింగ్ భారీగా జ‌ర‌గ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఓట‌ర్లు రాత్రి 11గంట‌ల దాటినా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. దీంతో వైసీపీ పెద్ద‌లు ఓట‌మి ఖాయ‌మ‌నే భావ‌న‌కు వ‌చ్చేశారు. మొత్తానికి ఐదుళ్లుగా అరాచ‌క పాల‌న‌ను కొన‌సాగించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలింగ్ బూత్ ల వ‌ద్ద ఓట‌ర్ల ఉత్సాహంతో గ‌ద్దెదిగ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.

By
en-us Political News

  
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.