వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తే ఏపీ అంధకారమే!
Publish Date:Jul 16, 2022
Advertisement
పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం మోగించేశారు. జనసేన ఎన్నికలకు సిద్ధంగా ఉందని ప్రకటించేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన శనివారం ఆయన లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఏపీ భవిష్యత్‌కు హానికరంగా మారిన వైసీపీ మరో సారి అధికారంలోకి రాకూడదన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజల్ని తాను కోరడం లేదనీ, ఈ ప్రభుత్వం కావాలా.. మరో ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తనకు జగన్ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోయినా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కోట్ల రూపాయలు సాయం అంద జేశానని చెప్పిన పవన్ కల్యాణ్. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును దురుద్దేశపూర్వకంగా పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పు దారి పట్టించేందుకే ఎన్నికల సమయంలో జనసేన ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్దికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకపోతే మనుగడ ఉండదన్నారు. గతంలోలాగే ఆయన ప్రసంగంలో కొంత అస్పష్టత కనిపించింది. జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని తాను కోరడం లేదని అంటూనే తమ పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీల అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. అభ్యర్థి ఎవరన్నది చూడకుండా తనను చూసి ఓటేయమన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. ఎన్నికలలో విజయంపై భిన్న వ్యాఖ్యలు చేసినా వైసీపీ అధికారంలోకి రాకూడదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు. కులాలను గౌరవిస్తూనే కుల రహిత సమాజం కోసం ఆలోచించాలన్నారు. యువత తిరగబడితేనే మార్పు వస్తుందన్నారు.
http://www.teluguone.com/news/content/ycp-a-hurdle-to-progerss-says-pawan-kalyan-39-139907.html





