Publish Date:Apr 25, 2022
యాదాద్రి పేరు మళ్లీ యాదగిరి గుట్టగా మారిందా? అలా కేసీఆరే మార్చేశారా? మళ్లీ పాత పేరుతోనే పిలవనున్నారా? చినజీయర్ స్వామి పెట్టినందుకే యాదాద్రి పేరు వినిపించకుండా చేస్తున్నారా? యాదాద్రి మాదిరే త్వరలో భద్రాద్రి పేరు కూడా మార్చేస్తారా? అంటే అవుననే అంటున్నారు.
అఫీషియల్‌గా యాదాద్రి పేరు మార్చినట్టు ఇంకా ప్రకటన రాకపోయినా.. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారంలో యాదగిరి గుట్టు అంటూనే వివరాలు రిలీజ్ చేశారు. ప్రెస్‌నోట్‌లో సైతం యాదగిరి గుట్ట అనే ఉండటం ఆసక్తికరంగా మారింది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చేయనున్నారని తెలుస్తోంది. అందుకే, ఇన్నాళ్లుగా లేనిది.. ఇప్పుడు కొత్తగా యాదగిరి గుట్ట పేరుతో ముఖ్యమంత్రి పర్యటన సమాచారం ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.
యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చడానికి చినజీయర్ కేసీఆర్ మధ్య విభేదాలే కారణమని అంటున్నారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి యాదగిరి గుట్ట అనే పేరు. తెలంగాణ వాసులంతా అలానే పిలుస్తారు. యాదాద్రి అనే పేరు ఇంకా అలవాటు కూడా కాలేదు. చినజీయర్ చెప్పారనే ఏళ్లుగా ఉన్న యాదగిరి గుట్టకు యాదాద్రి అని పేరు పెట్టారు. అలాగే భద్రాచలంను కూడా భద్రాద్రి అని నామకరణం చేసింది కూడా చినజీయరే. ఇన్నాళ్లూ ఆయనతో సీఎం కేసీఆర్ సఖ్యతగా ఉండటంతో కొత్త పేర్లు ఫిక్స్ అయ్యాయి. కానీ, ఇటీవల జీయర్ స్వామిని కేసీఆర్ పక్కనపెట్టేశారు. సమతామూర్తి విగ్రహ సమారోహనం ఎపిసోడ్‌లో కేసీఆర్ ఇగో హర్ట్ అయింది. అప్పటినుంచీ చినజీయర్‌ను హర్ట్ చేస్తున్నారు. ఆయన లేకుండానే యాదాద్రి ఆలయ పునరుజ్జీవ కార్యక్రమం జరిగిపోయింది. ఇప్పుడు చినజీయర్ పెట్టిన యాదాద్రి పేరును కూడా మార్చేసి.. మళ్లీ పాత పేరైన యాదగిరి గుట్టగానే ఉంచేయాలని భావిస్తున్నారు. స్థానికులు సైతం యాదాద్రి అంటే అదోలా ఉంది.. యాదగిరి గుట్ట అంటేనే మంచిగుంది అంటున్నారు. ఇక, చినజీయర్ పెట్టిన భద్రాద్రి పేరును కూడా మళ్లీ భద్రాచలం ఆలయంగా మార్చేసే ఆస్కారం ఉందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yadadri-as-yadagiri-gutta-39-134957.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.