జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో పిటిషన్

Publish Date:Feb 19, 2026

Advertisement

హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మూడు కార్పొరేషన్లుగా విభజిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి చట్టపరమైన సవాల్ ఎదురైంది. ఈ మేరకు జారీ చేసిన జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది. గురువారెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయ వాది కోర్టుకు వివరించిన అంశాలు ఈ కేసులో ప్రధానంగా నిలిచాయి.  2027 జనగణన నేపథ్యంలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ నెంబర్ 01 ప్రకారం ప్రస్తుతం జ్యూరి స్డిక్షన్ ఫ్రీజ్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ ఫ్రీజ్ కాలంలో మున్సిపల్ సరిహద్దులను మార్చడం, స్థానిక సంస్థలను పున ర్వ్యవస్థీకరించడం చట్ట విరుద్ధమని వాదించారు.

జీహెచ్ఎంసీ వంటి భారీ స్థానిక సంస్థను విభజిం చడం ద్వారా పరిపాలనా పరిధులు మారతాయని, ఇది   సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల జీవో నెంబర్ 55ను తక్షణమే రద్దు చేయాలని కోరారు.ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రాథమిక విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న అనంతరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తమ వాదనలు వెల్లడించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కౌంటర్లు దాఖలైన తర్వాత తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. జీహెచ్ఎంసీ విభజన అంశం ఇప్పటికే  పాలన, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. మహానగర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభజన అవసరమని ప్రభుత్వం భావిస్తుండగా, చట్టపరమైన పరిమితులు, జనగణన ప్రక్రియపై ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు హైకోర్టు ముందు నిలిచాయి.

హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. కేంద్రం, రాష్ట్రం సమర్పించే కౌంటర్లలో ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణపై హైకోర్టు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రంలోని స్థానిక సంస్థల పునర్వి భజనకు మార్గదర్శకంగా ఉండే అవకాశముంది.ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణపై రాజకీయ, పరిపాలనా, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

By
en-us Political News

  
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.