కుక్కల దాడిలో చిరుతపులి పిల్ల మృతి
Publish Date:Apr 7, 2026
Advertisement
అడవిలో నీటి వనరులు కరవవ్వడం వణ్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారింది. నీటిని వెతుక్కుంటూ జనావాసాలలోకి వస్తున్న వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా కుక్కల దాడిలో ఓ చిరుతపులి పిల్ల మరణించిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. దువ్యూరు మండలం చినబకరాపురంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది. పొలంలో చిరుతపులి పిల్ల మరణించి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీధికుక్కల దాడిలోనే చిరుత పులిపిల్ల చనిపోయిందని నిర్ధారించారు.
http://www.teluguone.com/news/content/leopard-cub-dies-in-dogs-attack-36-216898.html





