పెద్దవారిలో గాయలు ఎందుకు మానవు?

Publish Date:Dec 24, 2018

Advertisement


వయసు గడిచేకొద్దీ మనలో శక్తి కూడా తగ్గిపోతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అది అందరి అనుభంలోనూ గమనించే వాస్తవమే! కానీ ముసలివారికి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, అది అంత త్వరగా ఎందుకు మానదు? దీని వెనుక ఏదన్నా కారణం ఉందా? ఉంటే ఆ లోపాన్ని సవరించే అవకాశం ఉందా?... ఇలాంటి ఆలోచనలే వచ్చాయి రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులకు. ఫలితం! మున్ముందు వృద్ధులకు చేసే చికిత్సలో సమూలమైన మార్పులు తేగల ఒక విషయాన్ని కనుగొన్నారు.

 

ఇప్పటివరకూ వృద్ధులలో గాయాలు త్వరగా మానకపోవడానికి కారణం వారిలో షుగర్‌ వంటి వ్యాధులో, రోగనిరోధకశక్తిలో మార్పులో అనుకునేవారు. ఇందులో వాస్తవాన్ని గ్రహించేందుకు పరిశోధకులు రెండు నెలల నుంచి రెండేళ్ల వయసున్న ఎలుకలలో గాయం మానే తీరు గమనించారు. ఈ వయసు మనలో 20 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసుతో సమానం అన్నమాట. వీటికి ఏదన్నా గాయం అయినప్పుడు అక్కడి చర్మంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు. సాధారణంగా గాయం అయిన మరుసటి సెకను నుంచే మన శరీరం దానిని బాగుచేసుకునేందుకు తగిన చర్యలను చేపడుతుంది.

 

చర్మానికి ఏదన్నా గాయం అయినప్పుడు ఆ చర్మం అడుగుభాగంలో ‘కెరటినోసైట్స్‌’ (keratinocytes) అనే కణాలు చేరుకుని కొత్త చర్మం ఏర్పడేందుకు సహకరిస్తాయట. ఈ కెరటినోసైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే, స్కింట్స్ (Skints) అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్కింట్స్ వెంటనే అక్కడి రోగనిరోధకశక్తికి సాయపడుతున్న కణాలకు కొత్త చర్మం ఏర్పడేలా సాయం చేయమంటూ సూచనలు అందిస్తాయి. అయితే ఎలుకల వయసుమళ్లే కొద్దీ ఈ స్కింట్స్‌ ఉత్పత్తి తగ్గిపోయిందట. దాంతో గాయం మాన్పడంలో కెరటినోసైట్స్‌ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితం! గాయం చాలా నిదానంగా మానడాన్ని గమనించారు.

 

పెద్దవారిలో గాయాలు నిదానంగా మానడం వెనుక ఉన్న కారణం తెలిసింది సరే! మరి ఈ ఫలితం ఆధారంగా గాయాన్ని మాన్పే ప్రక్రియను గాడిలో పెట్టే అవకాశం ఉందేమో అని మరిన్ని పరిశోధనలు చేశారు. అందుకోసం వయసు మళ్లిన ఎలుకలలో గాయాన్ని మాన్పమంటూ సూచనలు అందించే ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచినప్పుడు, వాటిలోని కెరటినోసైట్స్‌ వేగంగా స్పందించడాన్ని గమనించారు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని మున్ముందు మన కణాల మధ్య ఉన్న సమాచార వ్యవస్థని మరింత వేగవంతం చేసే మందులను ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. అదే కనుక జరిగితే కేవలం గాయాలను మాన్పడంలోనే కాదు, వృద్ధాప్యం కారణంగా వచ్చే మరెన్నో సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు.

 

- నిర్జర.

By
en-us Political News

  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.