Top Stories

dummy

political-news-img

కన్నబిడ్డలను కడతేర్చి.. తల్లి ఆత్మహత్య.. హైదరాబా కూకట్‌పల్లిలో దారుణం

కట్టుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న మనస్తాపంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన కూకట్ పల్లి కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆవేదనతో 28 ఏళ్ల స్రవంతి తన కుమారులు కార్తిక్ , కౌశిక్ లను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణం స్రవంతి భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని గత కొంత కాలంగా తనను వేధిస్తుండటమేనని స్థానికుల ద్వారా తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదలా ఉండగా స్రవంతి తన కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో వీరి స్వగ్రామమైన వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలియగానే తాండాలో ఉన్న భర్త ప్రవీణ్ ఇంటిని స్రవంతి బంధువులు దగ్ధం చేశారు. స్రవంతిని వివాహం చేసుకున్న ప్రవీణ్ హైదరాబాద్ లో కాపురం పెట్టాడనీ, అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని స్రవంతిని నిత్యవ వేధించేవాడనీ బంధువులు తెలిపారు. భర్త వేధింపులు భరించలేక స్రవంతి పుట్టింటికి వచ్చేసిందనీ, అయితే ప్రవీణ్ ఇక నుంచీ స్రవంతి ని బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చి ఆమెను కాపురానికి తీసుకెళ్లాడనీ బంధువులు తెలిపారు. అలా వెళ్లిన స్రవంతి తన పిల్లలతో సహా ఇంట్లో విగతజీవిగా పడి ఉందనీ, ప్రవీణే భార్య పిల్లలను హత్య చేశాడని స్రవింతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా స్రవంతి సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో స్రవంతి భర్త తనను, పిల్లలన హత్య చాకుతో పొడిచి లేదా ఉరేసి చంపేస్తానంటూ బెదరిస్తున్నాడని సోదరుడికి చెప్పుకుంటూ ఈ వీడియో ఆవేదన వ్యక్తం చేసింది.

Publish Date: Mar 31, 2026 7:31PM

political-news-img

తెలంగాణలో చికెన్ షాపులు బంద్

తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. బుధవారం (ఏప్రిల్ 1) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు చికెన్ షాపుల యజమానుల సంఘం సమ్మెకు రెడీ అయ్యింది. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చికెన్ షాపుల యజమానుల సంఘం ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో, చికెన్ షాపుల ముందు ఈ బంద్‌కు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వ్యాపారులు ఈ మేరకు నోటీసులు, బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభాన్ని భారీగా తగ్గించేశాయన్నది చికెన్ దుకాణాల యజమానుల ప్రధాన ఆరోపణ. చికెన్ అమ్మగా వచ్చే లాభం కనీసం షాపు అద్దెకు, కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదంటున్నారు. పౌల్ట్రీ కంపెనీలు ఇష్టానుసారంగా, ఏకపక్షంగారేట్లు నిర్ణయిస్తూ తమను నష్టాల్లోకి నెడుతున్నాయని చెబుతున్న చికెన్ షాపుల యజమానులు తమ డిమాండ్లు నెరవేరే వరకూ దుకాణాలను తెరిచే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చి తమ ప్రాఫిట్ మార్చిన్ పెంచాలని విస్పష్టంగా చెబుతున్నారు. కాగా చికెన్ షాపుల నిరవధిక బంద్ ప్రకటనతో చికెన్ ప్రియులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతున్నారు.

Publish Date: Mar 31, 2026 7:11PM

political-news-img

ఉదయం పించన్ల పంపిణీ.. సాయంత్రం కోదండరామస్వామికి పట్టు వస్త్రాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నెల్లూరు, కడప జిల్లాల్లో బుధవారం (ఏప్రిల్ 1)పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ, ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవంలో సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత బుధవారం (ఏప్రిల్ 1) ఉదయం నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందిస్తారు. అనంతరం ఆయన నేరుగా కడప జిల్లా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేసి, లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటల 25 నిముషాలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. ఆరున్నర గంటలకు గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. ఒక బుధవారం రాత్రి ఒంటిమిట్టలోనే బస చేస్తారు.

Publish Date: Mar 31, 2026 6:56PM

political-news-img

మెరుగైన ప్రజారోగ్యం కోసం.. స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్ మెంట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ప్రతి నెలా 4వ శనివారం పాపులేషన్ మేనేజ్ మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కుప్పం, నారావారి పల్లెలలో నిర్వహించి అది సక్సెస్ కావడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం (మార్చి 31) సమీక్ష నిర్వహించారు. జులై నాటికల్లా సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలన్న లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూన్సిట్ అవసరం కానున్నాయని, రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇక వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించాలనీ, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలనీ సీఎం చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏమేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే ఈ 5 పిల్లర్లతో త్వరలో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీని త్వరలో అమలు చేయాలన్న అంశంపై కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు.

Publish Date: Mar 31, 2026 5:43PM

political-news-img

చేనేతలకు తెలుగుదేశం సర్కార్ ‘పవర్’ గిఫ్ట్.. రేపటి నుంచి ఉచిత విద్యత్ పథకం అమలు

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వర్గానికి చారిత్రాత్మకమైన భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేతలకు బుధవారం (ఏప్రిల్1) నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తీసుకువస్తున్నది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ప్రభుత్వం విద్యుత్‌ను ఉచితంగా అందిస్తుంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి, చేనేతలకు మరింత అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 మాగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ రాయితీ ద్వారా ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి ఏడాదికి రూ.8,640, అలాగే ప్రతి పవర్ లూమ్ యూనిట్ కు ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక అనివార్య ఖర్చుగా మారిన తరుణంలో, ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు నేతలకు గొప్ప సహాయం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచింది . రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు కేటాయించింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం రాయితీ కల్పిస్తోంది. ముడి సరుకులపై 15 రాయితీ ఇవ్వడంతో పాటు, నాణ్యమైన నూలు సరఫరాకు చర్యలు తీసుకుంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10.44 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటితో పాటు మార్కెటింగ్ సదుపాయం కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల ద్వారా నేరుగా అమ్మకాలు జరిపేలా అవకాశం కల్పించింది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నది.

Publish Date: Mar 31, 2026 5:26PM

political-news-img

చీలిక అంచున వైసీపీ.. అమరావతిపై జగన్ వైఖరే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.

Publish Date: Mar 31, 2026 4:40PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img