ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. క్యాన్సర్ గురించి తాజాగా బయటపడిన షాకింగ్ నిజం..!

Publish Date:Feb 4, 2026

Advertisement


క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య.  క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు.  ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి,  దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు,  ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  దీని గురించి ఆరోగ్య నిపుణులు,  ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం,  జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం,  శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా,  ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం,  శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది.  పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది.

ప్రభుత్వ విధానాలు..

తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు,  దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి.

ప్రజలు చేయాల్సినది..

క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.  క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి,  శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు,  ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవడం,  వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి.  ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో..
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.